TELANGANA TOURISM OPERATING TIRUPATI TOUR PACKAGE FROM HYDERABAD WITH LOW PRICE KNOW PACKAGE DETAILS SS
Tirupati Tour: శ్రీవారి దర్శనంతో తిరుపతి టూర్... తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ
Tirupati Tour: శ్రీవారి దర్శనంతో తిరుపతి టూర్... తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)
Tirupati Tour | శ్రీవారి దర్శనంతో తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్ (Hyderabad to Tirupati) ప్యాకేజీ ప్రకటించింది. తక్కువ ధరకే టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు చుట్టూ ఉన్న ఇతర ఆలయాలను సందర్శించవచ్చు.
తిరుపతి వెళ్లాలనుకునే హైదరాబాద్‌వాసులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి తిరుపతికి (Hyderabad to Tirupati) తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, కపిల తీర్థం కవర్ అవుతాయి. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. తిరుపతి టూర్ ప్యాకేజీ (Tirupati Tour Package) ప్రతీ శుక్రవారం, శనివారం అందుబాటులో ఉంటుంది. వీకెండ్లో తిరుపతికి వెళ్లి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.3,900 కాగా, పిల్లలకు రూ.3,120.
తెలంగాణ టూరిజం తిరుపతి టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు కేపీహెచ్బీలో, రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ యాత్రీనివాస్లో, రాత్రి 7.15 గంటలకు బేగంపేటలో, రాత్రి 8 గంటలకు బషీర్ బాగ్‌లో పర్యాటకులు తెలంగాణ టూరిజం టూరిస్ట్ బస్సు ఎక్కాలి. రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటారు. నాన్ ఏసీ రూమ్‌లో బస లభిస్తుంది. ఫ్రెషప్ అయిన తర్వాత తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, కపిల తీర్థం ఆలయాలు సందర్శించుకోవచ్చు. రాత్రికి తిరుపతిలోనే బస చేయాలి.
మూడో రోజు ఉదయం 8 గంటలకు తిరుమలలో శ్రీవారి దర్శనానికి బయల్దేరాలి. శీఘ్ర దర్శనం ప్యాకేజీలోనే కవర్ అవుతుంది. మధ్యాహ్నం 1 గంటలోపు దర్శనం పూర్తవుతుంది. దర్శనం తర్వాత తిరుపతికి బయల్దేరాలి. సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
పర్యాటకులు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్లో టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవాలి. తెలంగాణ టూరిజం తిరుపతి టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు తెలంగాణ టూరిజం బస్సులోనే ప్రయాణించాలి. ప్యాకేజీ బుక్ చేసుకొని ఈ టికెట్‌తో టీటీడీ ఆఫీసు దగ్గర రిపోర్ట్ చేయడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో రీఫండ్ కూడా రాదు. కాబట్టి తెలంగాణ టూరిజం బస్సులో టూర్ వెళ్లాలనుకునే భక్తులు మాత్రమే ఈ ప్యాకేజీ బుక్ చేయాలి.
ఇక కోవిడ్ 19 మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ముందుజాగ్రత్త చర్యగా కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. టూరిస్టులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్స్ సమర్పించాలి. లేదా దర్శనానికి 72 గంటల ముందు కోవిడ్ 19 నెగిటీవ్ సర్టిఫికెట్ తీసుకొని ఉండాలి. 18 ఏళ్లలోపువారికి కోవిడ్ 19 నెగిటీవ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.