హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ooty Tour: హైదరాబాద్ టు ఊటీ టూర్... తెలంగాణ టూరిజం ప్యాకేజీ

Ooty Tour: హైదరాబాద్ టు ఊటీ టూర్... తెలంగాణ టూరిజం ప్యాకేజీ

Ooty Tour: హైదరాబాద్ టు ఊటీ టూర్... తెలంగాణ టూరిజం ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

Ooty Tour: హైదరాబాద్ టు ఊటీ టూర్... తెలంగాణ టూరిజం ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

Hyderabad to Ooty Tour | ఊటీ వెళ్లాలనుకునే కొత్త జంటలకు, ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్. తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి ఊటీకి టూర్ ప్యాకేజీ (Hyderabad to Ooty Package) ప్రకటించింది. ఈ ప్యాకేజీలో బెంగళూరు, మైసూరులోని పర్యాటక ప్రాంతాలు కూడా కవర్ అవుతాయి.

ఇంకా చదవండి ...

ఎండలు మండిపోతున్నాయి. చలచల్లని ప్రాంతానికి వెళ్లి ఓ నాలుగైదు రోజులు గడిపి వద్దామనుకుంటున్నారా? తెలంగాణ టూరిజం (Telangana Tourism) హైదరాబాద్ నుంచి ఊటీకి (Hyderabad to Ooty) టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో (Tour Package) ఊటీతో పాటు బెంగళూరు, మైసూరులోని పర్యాటక ప్రాంతాలు కూడా కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ సోమవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. బస్సులో తీసుకెళ్లి ఊటీ, బెంగళూరు, మైసూరులోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తుంది. ఈ ప్యాకేజీ ధర ఎంత, ఈ టూర్ ఎలా సాగుతుంది? తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ఇదే.

తెలంగాణ టూరిజం ఊటీ టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు యాత్రీ నివాస్, 4 గంటలకు బషీర్‌బాగ్‌లో వోల్వో బస్ ఎక్కాలి. మొదటి రోజు బెంగళూరు బయల్దేరాలి. దారిలోనే డిన్నర్ చేయాల్సి ఉంటుంది. రెండో రోజు ఉదయం బెంగళూరు చేరుకుంటారు. బెంగళూరు లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. బుల్ టెంపుల్, లాల్ బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్ టెంపుల్ దర్శించుకోవచ్చు. రాత్రికి బెంగళూరులో బస చేయాలి.

IRCTC Tours: రూ.20,000 లోపు విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజెస్

మూడో రోజు తెల్లవారుజామున ఊటీ బయల్దేరాలి. మధ్యాహ్నానికి ఊటీ చేరుకుంటారు. ఆ తర్వాత లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. దొడ్డపెట, బొటానికల్ గార్డెన్ చూడొచ్చు. రాత్రికి ఊటీలో బస చేయాలి. నాలుగో రోజు ఉదయం మైసూర్ బయల్దేరాలి. సాయంత్రానికి మైసూరు చేరుకుంటారు. బృందావన్ గార్డెన్ సందర్శించొచ్చు. రాత్రికి మైసూరులో బస చేయాలి.

ఐదో రోజు ఉదయం మైసూరు లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. చాముండేశ్వరి ఆలయం, మైసూరు మహారాజ ప్యాలెస్, బిగ్ బుల్ టెంపుల్ సందర్శించొచ్చు. రాత్రికి మైసూరు నుంచి బయల్దేరాలి. ఆరో రోజు ఉదయం హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర చూస్తే పెద్దలకు రూ.9,900, పిల్లలకు రూ.7,920. సింగిల్ ఆక్యుపెన్సీ కావాలనుకుంటే అదనంగా రూ.3,000 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో వోల్వో బస్సులో ప్రయాణం, నాన్ ఏసీ అకామడేషన్ కవర్ అవుతుంది.

IRCTC Tours: హైదరాబాద్ నుంచి రూ.12,000 లోపు టూర్ ప్యాకేజీలు ఇవే

తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుమల, అరకు, షిర్డీ, శ్రీశైలం, వరంగల్, యాదగిరిగుట్ట లాంటి ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మరిన్ని వివరాలు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Ooty, Telangana tourism, Tourism, Travel

ఉత్తమ కథలు