హోమ్ /వార్తలు /బిజినెస్ /

Araku Tour: హైదరాబాద్ నుంచి అరకు... రూ.7,000 లోపే 5 రోజుల టూర్

Araku Tour: హైదరాబాద్ నుంచి అరకు... రూ.7,000 లోపే 5 రోజుల టూర్

Araku Tour: హైదరాబాద్ నుంచి అరకు... రూ.7,000 లోపే 5 రోజుల టూర్
(ప్రతీకాత్మక చిత్రం)

Araku Tour: హైదరాబాద్ నుంచి అరకు... రూ.7,000 లోపే 5 రోజుల టూర్ (ప్రతీకాత్మక చిత్రం)

Araku Tour | తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి అరకు టూర్ (Hyderabad to Araku Tour) ప్యాకేజీ అందిస్తోంది. ప్యాకేజీ ధర రూ.7,000 లోపే. అరకు అందాలతో పాటు విశాఖపట్నంలోని టూరిస్ట్ స్పాట్స్ చూడొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

శీతాకాలంలో ఆంధ్రా ఊటీ అరకుకు హైదరాబాద్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య వేలల్లో ఉంటుంది. నవంబర్ మొదటి వారం నుంచి జనవరి వరకు పర్యాటకుల సందడి అరకులో ఎక్కువగా ఉంటుంది. మరి మీరు కూడా హైదరాబాద్ నుంచి అరకు టూర్ (Hyderabad to Araku) వెళ్లాలనుకుంటున్నారా? తెలంగాణ టూరిజం (Telangana Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. కేవలం రూ.7,000 లోపే 5 రోజుల టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఈ టూర్ ప్యాకేజీలో ఏమేం కవర్ అవుతాయి? ఏఏ ప్రాంతాలు చూడొచ్చు? ఈ వివరాలు తెలుసుకోండి.

తెలంగాణ టూరిజం అరకు టూర్ సాగేది ఇలాగే

తెలంగాణ టూరిజం అరకు టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు పర్యాటక భవన్, 6.30 గంటలకు సీఆర్‌ఓ బషీర్‌బాగ్‌లో పర్యాటకులు టూరిస్ట్ బస్ ఎక్కాలి. రెండో రోజు ఉదయం 6 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. ప్రైవేట్ హోటల్‌లో ఫ్రెషర్ అయిన తర్వాత విశాఖపట్నం లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. కైలాసగిరి, సింహాచలం, రుషికొండ బీచ్, సబ్‌మెరైన్ మ్యూజియం లాంటివి చూడొచ్చు. రాత్రికి వైజాగ్‌లో హోటల్‌లో బస చేయాలి.

Araku Trains: అరకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త... మరో 32 ప్రత్యేక రైళ్లు

మూడో రోజు ఉదయం 6 గంటలకు అరకు బయల్దేరాలి. అరకులో ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు, ధింసా డ్యాన్స్ చూడొచ్చు. మూడో రోజు రాత్రి అరకులో బస చేయాలి. నాలుగో రోజు అరకు నుంచి అన్నవరం బయల్దేరాలి. అన్నవరం ఆలయం సందర్శించిన తర్వాత తిరుగుప్రయాణం ప్రారంభం అవుతుంది. ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

తెలంగాణ టూరిజం అరకు టూర్ ప్యాకేజీ ధర చూస్తే పెద్దలకు ఒకరికి రూ.6,999, పిల్లలకు రూ.5,599 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో నాన్ ఏసీ వాహనంలో ప్రయాణం, నాన్ ఏసీ హోటల్‌లో వసతి, వైజాగ్, అరకు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు కవర్ అవుతాయి. ఫుడ్, ఎంట్రీ టికెట్స్, దర్శనం టికెట్లు, బోటింగ్ ఛార్జీలు, లాండ్రీ ఛార్జీలు టూర్ ప్యాకేజీలో కవర్ కావు. హైదరాబాద్ నుంచి అరకు టూర్ ప్యాకేజీ ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

New Rules: ట్రైన్‌లో లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ కొత్త రూల్స్ గుర్తుంచుకోండి

తెలంగాణ టూరిజం తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న టూరిస్ట్ స్పాట్స్‌కి కూడా ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. గోవా, షిరిడీ, నాసిక్, ఊటీ లాంటి ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు ఆపరేట్ చేస్తోంది.

First published:

Tags: Araku, Telangana tourism, Visakhapatnam

ఉత్తమ కథలు