గోవా వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. టూరిజం సంస్థలు గోవాకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి గోవాకు ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. మరోవైపు తెలంగాణ టూరిజం (Telangana Tourism) కూడా హైదరాబాద్ నుంచి గోవాకు టూర్ (Hyderabad to Goa Tour) ప్యాకేజీ అందిస్తోంది. ఐదు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. తెలంగాణ టూరిజం బస్సులో గోవా తీసుకెళ్లి గోవాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను చూపించనుంది తెలంగాణ టూరిజం. ఐదు రోజుల టూర్ ప్యాకేజీ ధర కేవలం రూ.10,000 లోపు మాత్రమే కావడం విశేషం. తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. టూరిస్టులు మధ్యాహ్నం 2 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ కార్యాలయంలో గోవా వెళ్లి టూరిస్ట్ బస్సు ఎక్కాలి. దారిలో డిన్నర్ ఉంటుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 6 గంటలకు గోవా చేరుకుంటారు. పర్యాటకుల్ని హోటల్‌లో డ్రాప్ చేస్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత నార్త్ గోవా సైట్ సీయింగ్ ఉంటుంది. నార్త్ గోవా సైట్ సీయింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ట్రిప్‌లో మపుసా సిటీ, బోడ్జేశ్వర్ ఆలయం, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్, కలన్‌గ్యూట్ బీచ్, వెగేటర్ బీచ్ కవర్ అవుతాయి. రాత్రికి హోటల్లో బస చేయాలి.
Goa Trip: ఫ్రెండ్స్‌తో గోవా వెళ్తున్నారా? ఈ తప్పు చేస్తే రూ.10,000 ఫైన్
మూడో రోజు సౌత్ గోవా సైట్‌సీయింగ్ ఉంటుంది. ఈ ట్రిప్‌లో డోనా పౌలా బీచ్, మిరామర్, ఓల్డ్ గోవా చర్చ్, మంగ్వేషీ ఆలయం, కోల్వా బీచ్, మర్డోల్ బీచ్ కవర్ అవుతాయి. సాయంత్రం పాన్ జిమ్‌లో బోట్ క్రూజ్ ఎంజాయ్ చేయొచ్చు. పర్యాటకులు సొంత ఖర్చుతో బోట్ క్రూజ్ ఎక్కాలి. ఒక గంట హౌజ్ బోట్ క్రూజ్‌కు రూ.500 చెల్లించాలి. రాత్రికి హోటల్లో బస చేయాలి.
నాలుగో రోజు ఉదయం 11.30 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. నాలుగో రోజంతా ప్రయాణం ఉంటుంది. ఐదో రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐదు రోజుల టూర్‌లో పర్యాటకులు రెండు రోజులు పూర్తిగా గోవాలోనే టూర్ ఎంజాయ్ చేయొచ్చు.
IRCTC Kullu Manali Tour: హైదరాబాద్ నుంచి కులు మనాలీ టూర్ ప్యాకేజీ
తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే పెద్దలకు ఒకరికి రూ.9,900 కాగా, పిల్లలకు ఒకరికి రూ.7,920. సింగిల్ ఆక్యుపెన్సీ కోరుకునేవారు రూ.12,900 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఏసీ బస్సులో ప్రయాణం, సైట్ సీయింగ్, హోటల్‌లో అకామడేషన్ లాంటివి కవర్ అవుతాయి. పూర్తి వివరాలను తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://tourism.telangana.gov.in/ లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.