Vijaya Milk: విజయ పాల ధరల పెంపు...లీటరు పాల ధర ఎంతంటే...?

Vijaya Milk: తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల ధర లీటరుపై రూ.3 పెంచారు. తాజా పెంపుతో విజయ పాల ధర లీటరు రూ.47 అయింది.

news18-telugu
Updated: February 18, 2020, 10:54 PM IST
Vijaya Milk: విజయ పాల ధరల పెంపు...లీటరు పాల ధర ఎంతంటే...?
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
Vijaya dairy: విజయ పాల ధరలు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల ధర లీటరుపై రూ.3 పెంచారు. తాజా పెంపుతో విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. 2 నెలల క్రితమే లీటరుకు రూ.2 పెంచారు. దీంతో ఇప్పటికే రూ.5 పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. టోన్డ్‌ పాలు లీటరుకు రూ.47, హోల్‌ మిల్క్‌ లీటరుకు రూ.61, డైట్‌ మిల్క్‌ లీటరు రూ.41, స్టాండర్డైజ్‌ పాలు రూ.51, ఆవుపాలు రూ.47, టీ స్పెషల్‌ మిల్క్‌ రూ.45 చొప్పున ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు డెయిరీలు జనవరిలోనే పాల ధరలు పెంచేశాయి. ప్రస్తుతం విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. ప్రస్తుతం ధరల పెరుగుదలతో ప్రైవేటు డెయిరీలకు, విజయ డెయిరీకి ఉన్న తేడా తగ్గిపోయింది. పాడి రైతులకు ధర పెంచడానికే వినియోగదారులపైనా భారం వేయాల్సి వచ్చిందని డెయిరీ ఫెడరేషన్‌ వెల్లడించింది. పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు