హోమ్ /వార్తలు /బిజినెస్ /

Telangana RTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.. వివరాలివే

Telangana RTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.. వివరాలివే

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Telangana RTC MD Sajjanar) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బస్ స్టేషన్లలో (Bus Stations) క్యూఆర్ కోడ్, యూపీఐ(UPI) ద్వారా చెల్లింపులపై ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వస్తుండడంతో ఆ సేవలను మరింతగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీకి (Telangana RTC) ఎండీగా నియామకం అయినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్ (V.C Sajjanar IPSతన మార్క్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల (TSRTC Passengers) నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంకా ఆర్టీసికి కూడా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బస్టాండ్ లలో (Bus Stations) వివిధ సేవలకు డబ్బులను యూపీఐ (UPI), క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా చెల్లింపు సేవలను ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మహాత్మాగాంధీ బస్​స్టేషన్(MGBS)లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్​లోని రేతిఫైల్ బస్​పాస్ కౌంటర్​లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సేవలను ప్రారంభించిన సమయంలో ఆర్టీసీ ఎండీ ప్రయాణికులు ఈ సర్వీసులపై తమ అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని సజ్జనార్ (V.C Sajjanar IPS) కోరారు.

  Diwali Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

  PM Kisan: రైతులకు అలర్ట్.. ఇలా చేస్తే ఖాతాలోకి రూ. 4 వేలు.. రిజిస్ట్రేషన్ కు మరి కొన్ని రోజులే ఛాన్స్.. తెలుసుకోండి

  ప్రయాణికుల నుంచి వచ్చిన స్పందనతో జూబ్లీ బస్ స్టేషన్ (Jubilee Bus Station - JBS) లోనూ యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (V.C Sajjanar IPS) తాజాగా ప్రకటించారు. పార్సెల్, కార్గో బుకింగ్, బస్ పాస్ కౌంటర్లలో ఈ సేవలను ప్రారంభిస్తున్నామని వివరించారు. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సజ్జనార్ ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో ఈ సేవలను అన్ని బస్టాండ్లకు విస్తరించే అవకాశం ఉంది.

  First published:

  Tags: Sajjanar, Tsrtc

  ఉత్తమ కథలు