హోమ్ /వార్తలు /బిజినెస్ /

TSRTC: హైదరాబాద్ వాసులకు ఆర్టీసీ శుభవార్త.. ఆ టికెట్ ధరలు భారీగా తగ్గింపు.. ఎంతంటే?

TSRTC: హైదరాబాద్ వాసులకు ఆర్టీసీ శుభవార్త.. ఆ టికెట్ ధరలు భారీగా తగ్గింపు.. ఎంతంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లో 24 గంటల పాటు జర్నీకి వినియోగించే T24 టికెట్ కు సంబంధించిన ఛార్జీలను తగ్గించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Secunderabad

  తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లో 24 గంటల పాటు జర్నీకి వినియోగించే T24 టికెట్ కు సంబంధించిన ఛార్జీలను తగ్గించింది. ఇప్పటివరకు ఈ టికెట్ ధర రూ.120 ఉండగా.. దానికి రూ.100కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంటే 20 రూపాయలను తగ్గించింది. ఈ తగ్గింపు ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది ఆర్టీసీ. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఈ T24 టికెట్ ను కొనుగోలు చేసిన వారు 24 గంటల పాటు హైదరాబాద్ (Hyderabad) జంట నగరాలలో అన్ని సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. చార్మినార్, జూ పార్క్, ట్యాంక్ బండ్, బిర్లా టెంపుల్ లాంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శించవచ్చు. వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన వారికి ఈ టికెట్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో ఈ T24 టికెట్ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109గా ఉంది. అంటే.. ఈ టికెట్ తో లీటర్ పెట్రోల్ కన్నా తక్కువ ధరతో 24 గంటల పాటు జర్నీ చేయొచ్చన్నమాట.

  ఇదిలా ఉంటే.. తెలంగాణ ఆర్టీసీ (TSRTC) మేనేజింగ్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సరికొత్త నిర్ణయాలతో సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా సజ్జనార్ (Sajjanar) మరో కీలక కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఆర్టీసీలో గరుడ, రాజధాని బస్సులకు వేర్వేరుగా ఛార్జీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అత్యంత లగ్జరీగా ఉంటూ ఏసీ సదుపాయం ఉండే గరుడ బస్సుల్లో ఛార్జీలు అధికంగా ఉంటాయి. రాజధాని బస్సుల్లో గరుడాతో పోల్చితే ఛార్జీలు తక్కువగా ఉంటాయి. అయితే.. ఈ రెండు బస్సు ఛార్జీలను సమానం చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ.

  TSRTC Special Services: ఆఫీస్ నుంచే సొంత ఊర్లకు నేరుగా వెళ్లొచ్చు.. ఆ ఉద్యోగుల కోసం TSRTC స్పెషల్ సర్వీసులు.. వివరాలివే

  రాష్ట్రంలో నడిచే అన్ని బస్సు సర్వీసుల్లో ఈ నెల 30వ తేదీ వరకు ఇది అందుబాటులో ఉండనుంది. ఇంకా హైదరాబాద్-విజయవాడ (Hyderabad - Vijayawada) రూట్లో నడిచే గరుడ బస్సుల ఛార్జీలను ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలతో సమానం చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఈ విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు సజ్జనార్. అన్ని బస్ స్టేషన్లలో ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Hyderabad, Rtc, Tsrtc

  ఉత్తమ కథలు