హోమ్ /వార్తలు /బిజినెస్ /

Rythu Bandhu scheme: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు సాయంపై మంత్రి కీలక ప్రకటన

Rythu Bandhu scheme: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు సాయంపై మంత్రి కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాసంగి సీజన్లో పంట పెట్టుబడికి తెలంగాణ ప్రభుత్వం అందించే రైతు బంధు సాయాన్ని డిసెంబర్ లోనే అన్నదాతలకు అందిస్తామని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

యాసంగి సీజన్లో పంట పెట్టుబడికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అందించే రైతు బంధు సాయాన్ని (Rythu Bandhu scheme) డిసెంబర్ లోనే అన్నదాతలకు అందిస్తామని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister NiranjanReddy) అన్నారు. శనివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ధాన్యాన్ని అమ్మి మద్ధతు ధర పొందాలని సూచించారు.

దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు. వడ్లను బాగా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకు రావాలని రైతులకు సూచించారు. ఇలా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యాసంగి సీజన్లో సాగుకు నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు వరితో పాటు ఇతర పంటల సాగుకు సైతం మొగ్గు చూపాలని నిరంజన్ రెడ్డి కోరారు.

TS Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు, సిలబస్ పై బోర్డు కీలక ప్రకటన.. వివరాలివే

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు (Group-4 Jobs) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేయనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూలులో పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది అభ్యర్థులకు ఆదివారం ఉదయం మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు.

మంత్రి చొరవతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల సన్నద్ధతలో భాగంగా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో దేహ దారుఢ్య శిక్షణ శిబిర తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 70 రోజుల పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు సిద్ధిపేట, గజ్వేల్ లో ప్రిలిమినరీ-రాత పరీక్షకు 1030 మందికి శిక్షణ అందించారు. ఈ శిబిరంలో శిక్షణ పొంది 580 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఆసక్తి ఉన్న వారికి రెండవ దశలో తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.

First published:

Tags: Niranjan Reddy, Rythu bandhu, Telangana

ఉత్తమ కథలు