హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hyderabad Metro Phase 2: మెట్రో రైల్ విస్తరణతో లక్షలాది మందికి లబ్ధి.. ప్రజా రవాణా మరింత బలోపేతం.. మంత్రి కేటీఆర్ కీలక సమావేశం

Hyderabad Metro Phase 2: మెట్రో రైల్ విస్తరణతో లక్షలాది మందికి లబ్ధి.. ప్రజా రవాణా మరింత బలోపేతం.. మంత్రి కేటీఆర్ కీలక సమావేశం

మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్

మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్

శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాది మందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంతటి కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్ల పై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందన్నారు. శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాది మందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఇంతటి కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులను ఆదేశించారు. శంకుస్థాపన చేసే ప్రాంతంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాల్గొనే సమావేశ ప్రాంగణం తదితర ఏర్పాట్లను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన స్థలాల పరిశీలనకు రేపు మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలన చేయాలని కేటీఆర్ సూచించారు.

ఈ కార్యక్రమాలకు సంబంధించి నగరంలోని ట్రాఫిక్, రక్షణ ఏర్పాట్లు, ప్రణాళికల పైన ఇప్పటినుంచే కసరత్తు చేయాలని పోలీస్ శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదన్నారు. ఇది మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు కావడం వలన నగర వ్యాప్తంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు కావాలని కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు.

ఇందుకోసం అవసరమైన నగర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , మహమూద్ అలీ , సబితా ఇంద్రారెడ్డికి మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.

First published:

Tags: KTR, Metro Train

ఉత్తమ కథలు