TELANGANA MINISTER KTR HAS GIVEN INDIRECT OFFER TO TESLA OWNER ELON MUSK THAT TELANGANA WOULD BE THE BETTER PLACE FOR INDUSTRIES PRV
Minister KTR: ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ హైదరాబాద్‌లో..? ఎలన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆఫర్..!
ఎలన్, కేటీఆర్ (ఫైల్)
టెస్లా కంపెనీ విషయంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలన్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది మండిపడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ టెస్లా అధినేత వ్యాఖ్యలపై స్పందించారు.
బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon musk) కంపెనీ Teslaతన పూర్తి యాజమాన్యంలోని షోరూమ్‌లను దేశంలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టుంది. ఈ సింగిల్ బ్రాండ్ షోరూమ్‌లను తెరవడానికి నియమాలు , నిబంధనలకు సంబంధించి కంపెనీ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఒకవేళ కంపెనీ తన సింగిల్ బ్రాండ్ షోరూమ్‌ని దేశంలో ప్రారంభిస్తే, అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) నిబంధనలకు లోబడి ఉండాలి. బిజినెస్ స్టాండర్డ్ వార్తల ప్రకారం, ఈ దుకాణాలను తెరవడానికి, కంపెనీ స్థానిక కొనుగోలు నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఇండియాలోకి టెస్లా కార్ల ప్రవేశంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో ఎదురువుతోన్న సవాళ్ల కారణంగానే ఇండియాకు టెస్లా (Tesla entry in India) రాక ఆలస్యమవుతోందని మస్క్ ట్విట్టర్ (Twitter) లో ఆరోపించారు.
భారత ప్రభుత్వానికి (Indian Government) వ్యతిరేకంగా ఎలన్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది మండిపడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ (Telangana IT Minster KTR) టెస్లా అధినేత వ్యాఖ్యలపై స్పందించారు. ముందుగా భారత్ లో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్‌కు ధన్యవాదాలు చెప్పిన ఆయన.. ఆ తర్వాత తెలంగాణ/ ఇండియాలో పరిశ్రమల అభివృద్ధికి బోలెడు (Number of chances for Industries) అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచిందన్నారు.
ఇన్‌డైరెక్ట్‌గా హైదరాబాద్‌కు రావాలని..
ఇన్‌డైరెక్ట్‌గా టెస్లా కంపెనీ హైదరాబాద్ (Hyderabad)కి వస్తే స్వాగతిస్తాం అన్నట్లుగా కేటీఆర్ ట్వీట్ ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. దేశంలో తమ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని ట్విట్టర్లో కేటీఆర్ (Minister KTR) పేర్కొన్నారు . అయితే కేంద్రం మాత్రం కొర్రీలు పెడుతుండటం, తెలంగాణ మంత్రి మాత్రం ఎలన్ మస్క్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు ట్వీట్ చేయడంపై నెటిజన్లు (Netizens) చర్చించుకుంటున్నారు.
గతంలో టెస్లా కారుని స్వయంగా నడిపి చూశారు కేటీఆర్. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న టెస్లా మోడల్ ఎక్స్ కారుని అమెరికాలో నడిపారు. కారు బాగుందని తెలుపుతూ కొత్తగా ఆలోచించిన ఎలన్‌మస్క్‌కి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కాగా తాజాగా పాత ట్వీట్‌ని రీట్వీట్ చేశారు కేటీఆర్. ఆ వెంటనే అందరినీ ఆశ్చర్యపరిచేలా మరో ట్వీట్ చేశారు
భారత్‌లో తమ కార్లను ప్రవేశపెట్టేందుకు టెస్లా అధినేత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఈ విషయంపై భారత ప్రభుత్వం, మస్క్ మధ్య చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడం లేదు. ఇందుకు ఎలన్ విధించిన షరతులే కారణమని తెలుస్తోంది. మొదట విదేశాల్లో తయారుచేసిన కార్లను ఇండియాలో ప్రవేశపెడతామని, ఆతర్వాతే తయారీ యూనిట్ నెలకొల్పుతామని మస్క్ కండిషన్ పెట్టాడు.
Hey Elon, I am the Industry & Commerce Minister of Telangana state in India
Will be happy to partner Tesla in working through the challenges to set shop in India/Telangana
Our state is a champion in sustainability initiatives & a top notch business destination in India https://t.co/hVpMZyjEIr
టెస్లా కార్ల దిగుమతిపై సుంకాన్ని కూడా తగ్గించాలని ఎలన్ భారత ప్రభుత్వాన్ని కోరాడు. దీనిపై ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో భారత మార్కెట్లో టెస్లా కార్ల విడుదలపై ఓ నెటిజన్ ‘ టెస్లా కార్లు బాగుంటాయి.. ఇండియాలో వీటి విడుదలపై ఏమైనా అప్డేట్ ఉందా?’ అని మస్క్ ను ట్యాగ్ చేస్తూ ఆసక్తికర ప్రశ్న సంధించాడు ఓ నెటిజన్. దీనిపై స్పందించిన మస్క్ ‘ భారత ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పటికీ దీనిపై ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు కేటీఆర్ కూడా మస్క్ వ్యాఖ్యలపై స్పందించారు. కాగా, టెస్లా కంపెనీ మాత్రం బెంగళూరుపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు కూడా పోటీపడుతోంది. దీంతో చివరికి టెస్లా కేటీఆర్ సానుకూల థృక్పథానికి హైదరాబాద్ (Hyderabad) వస్తుందా..? ముందు అనుకున్నట్లుగానే బెంగళూరు ఎంచుకోనుందా చూడాలి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.