Home /News /business /

TELANGANA LARGEST INNOVATION CAMPUS T HUB 2 0 ALL YOU NEED TO KNOW NS

T Hub 2.0 Hyderabad: అంతర్జాతీయ ప్రమాణాలతో టీ హబ్.. దేశంలోనే నంబర్ 1.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

టీ హబ్ (ఫొటో: ట్విట్టర్)

టీ హబ్ (ఫొటో: ట్విట్టర్)

దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ 2ను సీఎం కేసీఆర్ ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. మాదాపూర్లో అత్యున్నత ప్రమాణాలతో, అధునాతన సౌకర్యాలతో దీనిని నిర్మించారు.

    దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ (Start-Up) ఇంక్యుబేటర్ టీ హబ్ 2ను సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. మాదాపూర్లో అత్యున్నత ప్రమాణాలతో, అధునాతన సౌకర్యాలతో దీనిని నిర్మించారు. వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన టీ హబ్ 2ను ప్రభుత్వం రూ.400 కోట్ల పెట్టుబడితో 3ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఇందులో ఒకేసారి 2 వేలకు పైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశారు. శాండ్‌విచ్ ఆకారంలో కనిపిస్తూ.. అందరినీ ఆకర్షించేలా దీనిని నిర్మించింది తెలంగాణ సర్కార్. స్టార్టప్ లకు ప్రోత్సాహం కల్పించడమే లక్ష్యంగా 2015లో టీ హబ్ ను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఏర్పాటు చేసింది. ఇప్పుడు దానికి అనుబంధంగా సెకండ్ ఫేజ్ ను తీసుకువచ్చారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్ ఫస్ట్ ఫేజ్ ను ఏర్పాటు చేశారు. అది సక్సెస్ కావడం.. ఆశించిన ఫలితాలను ఇవ్వడంతో సెకండ్ ఫేజ్ ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ. 400 కోట్లను వెచ్చించింది ప్రభుత్వం. 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.

    ఇందులో ఒకేసారి 4 వేల స్టార్టప్ లకు అవసరమైన వసతులను కల్పించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా’ స్టేట్ సెంటర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ’ కూడా ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్ లను కొత్త బిల్డింగ్ లోకి తరలించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొదటి దశతో పోల్చితే ఇది ఐదు రెట్లు పెద్ద ఇంక్యుబేటర్ అవుతుందని అధికారులు అంటున్నారు. ఇందులో అత్యాధునిక వసతులు కల్పించారు అధికారులు.
    Start Up: మోడీ మెచ్చుకున్న హైదరాబాద్ స్టార్టప్.. వాళ్లేం తయారు చేస్తున్నారో తెలిస్తే షాక్









    దీనిని మొత్తం పది అంతస్తుల్లో నిర్మించగా.. ప్రస్తుతం ఐదు అంతస్తుల్లో కార్యకలాపాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో కార్యాలయాలను ఏర్పాటు చేయాలనుకునే వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్ లు, ఇతర సంస్థలను నిపుణుల బృందం సెలక్ట్ చేస్తుంది. టీ హబ్ ఫస్ట్ ఫ్లోర్ ను వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసుల కోసం పూర్తి ఉచితంగా కేటాయించనున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ను సైతం ఇక్కడికి తరలించనున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Investments, Start-Up, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు