Home /News /business /

TELANGANA IT MINISTER KTR LAID FOUNDATION STONE FOR SMART DATA CENTER OF NATIONAL PAYMENT CORPORATION OF INDIA NPCI IN HYDERABAD SS

రూ.500 కోట్లతో హైదరాబాద్‌లో ఎన్‌పీసీఐ స్మార్ట్ డేటా సెంటర్... మరిన్ని ఉద్యోగావకాశాలు

రూ.500 కోట్లతో హైదరాబాద్‌లో ఎన్‌పీసీఐ స్మార్ట్ డేటా సెంటర్... మరిన్ని ఉద్యోగావకాశాలు
(image: KTR/Twitter)

రూ.500 కోట్లతో హైదరాబాద్‌లో ఎన్‌పీసీఐ స్మార్ట్ డేటా సెంటర్... మరిన్ని ఉద్యోగావకాశాలు (image: KTR/Twitter)

NPCI smart data centre | తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న స్మార్ట్ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగబోతున్నాయి.

    భారతదేశంలోని అన్ని రీటైల్ పేమెంట్స్‌కు కేంద్ర బిందువైన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో స్మార్ట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా నార్సింగ్ గ్రామంలో స్మార్ట్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్మార్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది ఎన్‌పీసీఐ. ఈ సెంటర్ ద్వారా డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు ప్రధానంగా సేవలు అందించనుంది. నెలకు 1400 కోట్ల ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.15 లక్షల కోట్ల పేమెంట్స్‌కు ఈ డేటా సెంటర్ మేజర్ హబ్‌గా మారనుంది.


    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్-IBA సంయుక్తంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI సంస్థను ఏర్పాటు చేశాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ వ్యాలెట్స్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఎన్‌పీసీఐ పర్యవేక్షిస్తుంది. భారీ సదుపాయాలతో అతిపెద్ద స్మార్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఎన్‌పీసీఐ తెలంగాణను ఎంచుకుంది. ఈ డేటా సెంటర్‌ను పూర్తి స్థాయిలో నిర్మిస్తే దేశంలోని అన్ని డిజిటల్ లావాదేవీలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతుంది. స్మార్ట్ డేటా సెంటర్‌ నిర్మాణ పనుల్ని ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది ఎన్‌పీసీఐ.
    First published:

    Tags: EMPLOYMENT, KTR, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    తదుపరి వార్తలు