జన్‌ధన్ ఖాతాల్లోంచి రూ.16 కోట్లు వెనక్కి తీసుకున్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు..

లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జన్ ధన్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: April 29, 2020, 8:06 AM IST
జన్‌ధన్ ఖాతాల్లోంచి రూ.16 కోట్లు వెనక్కి తీసుకున్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జన్ ధన్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో దాదాపు 3 లక్షల జన్‌ధన్‌ ఖాతాలకు పీఎంజీకేవై కింద జమ చేసిన రూ.16 కోట్లకు పైగా నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనక్కి తీసుకుంది. రూ.500 చొప్పున మూడు నెలల పాటు జమ చేస్తామని చెప్పిన కేంద్రం.. ఈ నెల మొదట్లో దేశ వ్యాప్తంగా నగదు జమ చేసింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని 473 శాఖల్లో సుమారు 9 లక్షల ఖాతాల్లో రూ.500 చొప్పున జమ అయ్యాయి. అయితే వీరిలో 5,15,260 మంది మినహా మిగిలిన వారిని అనర్హులని బ్యాంకు గుర్తించింది.

దీంతో.. అనర్హుల ఖాతాల్లో జమ చేసిన సుమారు రూ.16 కోట్లకు పైగా నగదును వెనక్కి తీసుకున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు తెలిపింది. 2014 ఆగస్టు 1 తర్వాత ప్రారంభించిన ఖాతాలనే అర్హులుగా తేల్చినట్లు ఆయన వెల్లడించారు. బ్యాంకులో జరిగిన పొరపాటు వల్లే నగదును అనర్హులకు జమచేశామని, ఇప్పుడు వారిని గుర్తించి వెనక్కి తీసుకున్నామని జీఎం వివరించారు. అయితే, ఇప్పటికే లక్షకు పైగా ఖాతాదారులు నగదును తీసుకున్నారని.. వారి నుంచి ఆ డబ్బును రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
First published: April 29, 2020, 8:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading