Home /News /business /

TELANGANA ELECTRICITY EMPLOYEES STRIKE MAY CAUSE POWER CUTS IN THE STATE NS

Power Cut in Telangana: రేపు తెలంగాణ అంతటా విద్యుత్ సరఫరాలో అంతరాయం? ఎందుకో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై విద్యుత్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. మోదీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలను నిర్వహిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై విద్యుత్ ఉద్యోగులు (Electricity Employees) భగ్గుమంటున్నారు. మోదీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మహా ధర్నాకు పిలుపు నిచ్చారు. ఆగస్టు 8వ తేదీన అంటే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్  ఉద్యోగులు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులంతా మహాధర్నా నిర్వహించనున్నారు. విద్యుత్ ఉద్యోగులంతా విధులకు హాజరు కాకపోతుండడంతో సోమవారం తెలంగాణలో విద్యుత్ సరఫరాపై ఈ ప్రభావం పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సరఫరా (Power Cut) నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ రాష్ట్రం అంతా విద్యుత్ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరించడం కష్టం అవుతుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు సహకరించానలి విద్యుత్ ఉద్యోగులు ప్రజలను కోరుతున్నారు.

    కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న విద్యుత్ చట్టం ద్వారా తమకంటే కూడా విద్యుత్ వినియోగదారులకే ఎక్కువ నష్టం అని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. తమ ఆందోళనలను లెక్క చేయకుండా మోదీ సర్కార్  మొండిగా విద్యుత్ చట్టం సవరణ సవరణ బిల్లును ప్రవేశపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. చట్టం ప్రవేశపెడితే విధులను పూర్తి స్థాయిలో బహిష్కరిస్తామని స్పష్టం చేస్తున్నారు.
    Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. వేయికి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

    విద్యుత్‌ రంగాన్నే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటికరించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి ఖర్చు లేకుండా అదే విద్యుత్ లైన్ నుంచి కరెంట్ సరఫరా చేసే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీలు అధికం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


    కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న విద్యుత్ విధానాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. నిన్న నిర్వహిచిన ప్రెస్ మీట్లోనూ ఈ అంశంపై ధ్వజమెత్తారు. కేంద్ర విధానాల కారణంగా విద్యుత్ ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడంపై మండిపడ్డారు కేసీఆర్.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Power cuts, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు