Home /News /business /

TELANGANA CYBERABAD POLICE SHARES SHOCKING VIDEO OF YOUTH CARELESS DRIVING NS

TS Police-Viral Video: తెలంగాణ పోలీసుల షాకింగ్ వీడియో.. చూస్తే ఇంకో సారి మీ బైక్ ను ఓవర్ టేక్ చేయరు

ఫొటో: ట్విట్టర్

ఫొటో: ట్విట్టర్

రోడ్డు ప్రమాదాలను నివరించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంలో గతంలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాలకు చెందిన వీడియోలను షేర్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

    అతి వేగం వద్దు.. ప్రమాదకరం అంటూ ఎన్నిసార్లు చెప్పినా.. కొందరి తీరు మాత్రం అస్సలు మారడం లేదు. ముఖ్యంగా యువత అతి వేగం కారణంగా ప్రాణాలను (Accidents) కోల్పోయి.. కన్నవారికి, కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివరించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు (Telangana Police) అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంలో గతంలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాలకు చెందిన వీడియోలను షేర్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదం అంచుల్లోకి వెళ్లి బయటపడ్డ యువకులకు సంబంధించిన వీడియో అది. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఆ వీడియోను చేశారు.

    ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. యాక్టివాపై వెళ్తున్న ఇద్దరు యువకులు ఓ అండర్ బ్రిడ్జ్ ఉన్న ప్రాంతంలో ఓ ట్రాలీ ఆటోను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే.. అదే సమయంలో ఓ లారీ ఎదురుగా రావడంతో దాని ముందు టైర్ వద్దకు వెళ్లింది వీరు వెళ్తున్న యాక్టివా. అయితే.. వెంటనే అప్రమత్తమైన ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ వాహనాన్ని కుడి చేతివైపునకు తిప్పాడు. దీంతో ఆ యాక్టివా ఆటో వైపు వెళ్లింది. అయితే.. తృటిలో ఆ ప్రమాదం తప్పింది.



    అనంతరం.. వెనుక నుంచి వస్తున్న ఓ యువతికి వీరి కారణంగా ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ యువతి కూడా వెంటనే అప్రమత్తం కావడంతో ఆమెకు సైతం ప్రమాదం తప్పింది. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియోను షేర్ చేసిన పోలీసులు దానికి How long do we depend on luck? అనే కాప్షన్ పెట్టారు. ఇరుకైన రోడ్డు, క్యారేజ్ వేపై వెడెల్పు తక్కువ ఉన్న చోట బండిని ఓవర్ టేక్ చేయకూడదు అంటూ ఆ వీడియో ద్వారం సందేశం ఇచ్చారు తెలంగాణ పోలీసులు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Accident, Cyberabad police, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు