హోమ్ /వార్తలు /బిజినెస్ /

Telangana Traffic Police: రాత్రి పూట ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాల్సిన అవసరం లేదా? యాక్సిడెంట్ వీడియోతో క్లారిటీ ఇచ్చిన తెలంగాణ పోలీస్

Telangana Traffic Police: రాత్రి పూట ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాల్సిన అవసరం లేదా? యాక్సిడెంట్ వీడియోతో క్లారిటీ ఇచ్చిన తెలంగాణ పోలీస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ పోలీసులు (Telangana Police) టెక్నాలజీ, సోషల్ మీడియా వినియోగంలో ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్ పాటించడంపై ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ పోలీసులు (Telangana Police) టెక్నాలజీ, సోషల్ మీడియా (Social Media) వినియోగంలో ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. టెక్నాలజీని వినియోగించి అనేక మంది నేరగాళ్ల ఆటకట్టిస్తూ ఉన్నారు మన పోలీసులు. ఇంకా అనేక కేసులను సైతం సులువుగా ఛేదిస్తూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఇంకా సోషల్ మీడియా వినియోగంలోనూ తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియా ద్వారా వివిధ కేసుల వివరాలను తెలపడంతో పాటు సైబర్ నేరాలు (Cyber Crime), రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు తెలంగాణ పోలీసులు. రోడ్డు ప్రమాదాలకు (Road Accidents) సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. తద్వారా రోడ్డు భద్రతా నిబంధనలు, రూల్స్ ను ప్రజలకు తెలిసేలా వివరిస్తూ ఉంటారు.


  రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం సోషల్ మీడియా ద్వారా వివరిస్తూ ఉంటారు తెలంగాణ పోలీసులు. సాధారణంగా రాత్రి సమయంలో ఇంకా ట్రాఫిక్ లేని సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాల్సిన అవసరం లేదన్న అపోహ ఉంటుంది. అయితే.. ఓ వీడియో ద్వారా ప్రజలకు ముఖ్యంగా వాహనదారులకు సమాధానం ఇచ్చారు తెలంగాణ పోలీసులు.
  Telangana: తెలంగాణలో శాంతి భద్రతలు.. హోం మంత్రి కీలక ప్రకటన.. వారికి వార్నింగ్
  రాత్రి పూట రెడ్ లైట్ ఉన్న సమయంలో వేగంగా సిగ్నల్ ను దాటేందుకు ప్రయాణించిన కారు ఓ బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకున్న వీడియో ఇది. ‘‘రాత్రి సమయాల్లో మరియు ఎలాంటి ట్రాఫిక్ లేనప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పాటించాల్సిన అవసరం లేదు.’’ అన్నది అపోహ మాత్రమేనని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సందర్భంగా ట్విట్టర్ లో తెలిపారు. ఎల్లప్పుడూ ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Hyderabad Traffic Police, Road safety, Telangana, Traffic police

  ఉత్తమ కథలు