పవర్ కట్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? అయితే సిద్ధంగా ఉండండి. భవిష్యత్తులో మరిన్ని విద్యుత్ కోతలు (Power Cuts) తప్పవు. ప్రస్తుతం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పవర్ కట్స్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. గత 38 ఏళ్లల్లో చూస్తే ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ (Electricity Demand) బాగా పెరిగిందని, దీనికి తోడు వేసవికి ముందు చూస్తే తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయి వద్ద బొగ్గు నిల్వలు మిగిలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించినప్పుడు పరిశ్రమలు మూతపడిన సంగతి తెలిసిందే. కానీ కోవిడ్ ఆంక్షలన్నీ పూర్తిగా ఎత్తేయడంతో భారతీయ పరిశ్రమలన్నీ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. కానీ బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ కోతలు తప్పట్లేదు.
ఇప్పటితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. పరిశ్రమలు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8.7 శాతం విద్యుత్ లోటును ఎదుర్కొంటోందని రాయిటర్స్ ప్రభుత్వ డేటాను విశ్లేషించింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.
Save Power Bill: విద్యుత్ ఛార్జీలు పెరిగాయి... ఈ టిప్స్‌తో మీ కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు
గత కొన్ని రోజులుగా, పరిశ్రమలు 50 శాతం సరఫరాతో నడుస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు తప్పట్లేదు. విద్యుత్ కోతలపై ప్రతిపక్షాలు నిరసనలకు దిగుతున్నాయి. ఈ పరిస్థితి తాత్కాలికం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50-55 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతను ఎదుర్కొంటోందని సమాచారం.
దేశంలోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలో విద్యుత్తు అంతరాయాలు ఎదుర్కోనుంది. గత వారంలో డిమాండ్‌లో విద్యుత్ కొరత 1.4 శాతానికి పెరిగిందని ప్రభుత్వ డేటాను రాయిటర్స్ విశ్లేషించింది. గత అక్టోబర్‌లో భారతదేశంలో తీవ్రమైన బొగ్గు కొరత ఉన్న సమయంలో ఉన్న 1 శాతం లోటు కంటే ఇది ఎక్కువ. మార్చిలో ఈ లోటు 0.5 శాతంగానే ఉంది.
Business Idea: ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్... రూ.70,000 పెట్టుబడి చాలు
విద్యుత్ సరఫరా కన్నా డిమాండ్ ఎక్కువ ఉన్నందున మహారాష్ట్ర చాలా సంవత్సరాల తర్వాత నిర్బంధ విద్యుత్ కోతలను చూస్తోంది. విద్యుత్ కొరత 2,500 మెగావాట్లకు పైగా ఉన్నట్టు రాష్ట్ర డిస్కమ్ ప్రకటించింది. మహారాష్ట్రలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అమలులో ఉంటాయని మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, బొగ్గు కొరత ఫలితంగా 2,500-3,000 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే 4,000 మెగావాట్లు ఎక్కువగా ఈ ఏడాది 28,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది.
వాతావరణ అధికారులు ఏప్రిల్‌లో అనేక ఉత్తర, మధ్య ప్రాంతాలలో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని ముందుగానే అంచనా వేయడంతో భారతదేశంలో వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని భావించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జార్ఖండ్, బీహార్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 3 శాతానికి పైగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి.
మార్చి 2023తో ముగిసిన సంవత్సరంలో మొత్తం పవర్ అవుట్‌పుట్ 15.2 శాతం పెరిగినట్లు ఫెడరల్ పవర్ మినిస్ట్రీ నోట్‌ను విశ్లేషించిన రాయిటర్స్ తెలిపింది. ఈ డిమాండ్ చూస్తే గత 38 సంవత్సరాల్లో ఇప్పుడు వేగంగా పెరుగుతుందని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ELectricity, Power cuts, Power problems, Power tariff