జెఫ్ జెజోస్ ఈ మధ్య అంతరిక్ష యాత్ర చేసొచ్చారు తెలుసు కదా. అయితే, ఆయనతో పాటు అంతరిక్షానికి వెళ్లిన టీమ్‌లో ఓ 18 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు.ఆ కుర్రాడి పేరు ఒలీవర్ డేమన్.అయితే, ఇప్పుడు ఆ కుర్రాడి గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బిజోస్తో అంతరిక్ష యాత్ర చేసిన ఒలీవర్ గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటికొచ్చింది. ఆ విషయం తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. డౌటా... అయితే ఈ వార్త చదివేయండి మరి.
ఒలీవర్ డచ్‌కు చెందిన ఈ కుర్రాడుజెఫ్ బిజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ స్పేస్ ఫ్లైట్‌లో ఇటీవల అంతరిక్ష యాత్ర చేసి వచ్చాడు. ఆ తర్వాత ఒలీవర్ మీడియాతో మాట్లాడాడుతూ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అవేంటంటే... ఇప్పటివరకు ఒలీవర్ అమెజాన్ వెబ్సైట్లో ఒక్క ప్రోడక్ట్ కూడా కొనలేదట. అంతేకాదు ఈ విషయం నేరుగాబెజోస్కి కూడా చెప్పానని తెలిపాడు. బ్లూ ఆరిజన్ ప్రాజెక్ట్‌లోకి వస్తున్నప్పుడే బెజోస్ దగ్గర ఈ విషయం ప్రస్తావించాడట ఒలీవర్. దానికి బిజోస్ కూడా ఆసక్తికరంగా స్పందించడాడట.‘అవునా... నేను ఇలాంటి మాట విని చాలా రోజులైంది’ అంటూ నవ్వేశారట బెజోస్.
ఒలీవర్‌కు బ్లూ ఆరిజన్ ప్రయాణానించే అవకాశం అనూహ్యంగా దక్కింది.తొలుత ఆయన బదులు వేరొకరు వెళ్లాలి. దాని కోంస 28 మిలియన్ డాలర్లకు బిడ్డింగ్ కూడా పూర్తయింది. అయితే ఆఖరులో ఆ వ్యక్తి తప్పుకోవడంతో ఒలీవర్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. ఈ ప్రాజెక్టు విషయం తెలిసే సమయంలో ఒలీవర్ ఫ్యామిలీ టూర్లో భాగంగా ఇటలీలో ఉన్నారట. అయితే, ఒలీవర్ మాత్రం బ్లూఆరిజిన్లో ప్రయాణం కోసం28 మిలియన్ డాలర్లు కూడా ఇవ్వలేదట. అయినా అవకాశం ఇచ్చారంటే దానికి కారణం ఒలీవర్ కుర్రాడు అనేనట. దాంతోపాటు ఒలీవర్ పైలట్ కావడం కలిసొచ్చింది.అంతరిక్ష ప్రయాణం గురించి అతనికి కాస్త అవగాహన ఉండటంతో జెఫ్ జెజోస్ అతన్ని ఎంపిక చేశాడు.
కాగా, తాను ఎప్పటికైనా అంతరిక్ష ప్రయాణం చేయాలని ఒలీవర్ కల.అయితే, అది ఇంత త్వరగా సాధ్యపడుతుందని ఎప్పుడూ అనుకోలేదట. బ్లూ ఆరిజన్ రాకెట్లో కూర్చున్నంతవరకు నమ్మశక్యం కాలేదట ఒలీవర్కి. అంతరిక్ష ప్రయాణం అనుభవం అయితే అదిరిపోయిందట. అనుకున్నదానికన్నా అద్భుతంగా సాగిందని చెప్పుకొచ్చాడు. ప్రయాణానికి రెండు రోజుల ముందే శిక్షణచ్చారని పేర్కొన్నాడు. తనకు ప్రస్తుతం ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలు లేవని.. స్పేస్ ట్రావెల్‌ని కెరీర్‌గా తీసుకోవడానికి ఆలోచన చేస్తా అంటున్నాడు ఒలీవర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Trending videos