కామర్స్‌లో పీజీ... జొమాటోలో డెలివరీ బాయ్... నిరుద్యోగ సమస్యకు సాక్ష్యం

షౌవిక్ దత్తా ఫేస్‌బుక్ పోస్టును ఇప్పటికే 6 వేల మంది ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చర్చకు దారితీసిన పోస్ట్ ఇది.

news18-telugu
Updated: February 13, 2019, 9:54 AM IST
కామర్స్‌లో పీజీ... జొమాటోలో డెలివరీ బాయ్... నిరుద్యోగ సమస్యకు సాక్ష్యం
కామర్స్‌లో పీజీ... జొమాటోలో డెలివరీ బాయ్... నిరుద్యోగ సమస్యకు సాక్ష్యం
  • Share this:
భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే స్వీపర్, క్లర్క్ పోస్టుకు కూడా పీజీలు, పీహెచ్‌డీలు చదివిన వాళ్లు దరఖాస్తు చేస్తుంటారు. జొమాటోలో పనిచేసే ఓ డెలివరీ బాయ్ కథ కూడా అలాంటిదే. కామర్స్‌లో పీజీ చదివి జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఆ యువకుడు దేశంలోని నిరుద్యోగ సమస్యకు నిలువెత్తు సాక్ష్యం. ఈ విషయాన్ని జొమాటో కస్టమర్ ఒకరు గుర్తించి ప్రపంచానికి తెలియజేశాడు. అతని పేరు షౌవిక్ దత్తా. కోల్‌కతావాసి. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. "మీ ఫుడ్ పికప్ చేసుకోవడానికి మెరాజ్ రెస్టారెంట్‌కు వెళ్తున్నాడు" అని జొమాటోలో లైవ్ స్టేటస్ కనిపించింది. ఆ డెలివరీ బాయ్ ప్రొఫైల్ చదివాడు కస్టమర్. ప్రొఫైల్ చూసి షాకయ్యాడు. కోల్‌కతాకు చెందిన మెరాజ్ కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడని, హిందీ, బెంగాలీ మాట్లాడగలడని ప్రొఫైల్‌లో కనిపించింది. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. తాను తీసుకున్న స్క్రీన్‌షాట్‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. షౌవిక్ దత్తా ఇలా రాశాడు.


జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసినందుకు బాధపడటం ఇదే మొదటిసారి. డెలివరీ ఏజెంట్ ప్రొఫైల్‌లో POST GRADUATE IN COMMERCE అని రాసి ఉంది. కాసేపటికే అతని నుంచి కాల్ వచ్చింది. నేను ఫుడ్ తీసుకోవడానికి వెళ్లి డోర్ ఓపెన్ చేశాను. నా ముందు ఓ వ్యక్తి నవ్వుతూ నిల్చున్నాడు. పార్శిల్ నా చేతికి ఇచ్చాడు. నా జీవితంలో అత్యంత ఇబ్బందికరమైన క్షణం అది. అతను చేతులు కట్టుకొని 'సార్ కొంచెం రేటింగ్ ఇవ్వండి' అని అడిగాడు. అతనితో కాసేపు మాట్లాడాను. మెరాజ్ కోల్‌కతా యూనివర్సిటీలో కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాడని తెలిసింది. అంతే కాదు పీజీడీఎం-ఫైనాన్స్ కోర్సు కూడా చదివాడు. మనం ఈ దేశానికి ఏం చేస్తున్నాం. మాస్టర్స్ చదివిన వ్యక్తి నాలాంటి అండర్ గ్రాడ్యుయేట్ టీనేజర్‌కు ఫుడ్ డెలివరీ చేయడం ఏ సందేశాన్ని ఇస్తోంది. దేశం మారాలి. రాష్ట్రం మారాలి. ఉద్యోగాలు రావాలి. మనం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. దేశం మారాలి.
షౌవిక్ దత్తా ఫేస్‌బుక్ పోస్టు సారాంశం


షౌవిక్ దత్తా ఫేస్‌బుక్ పోస్టును ఇప్పటికే 6 వేల మంది ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చర్చకు దారితీసిన పోస్ట్ ఇది. ఇటీవల నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ 2019 నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగ సమస్య 45 ఏళ్ల గరిష్టస్థాయిలో ఉందని తేల్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను తిరస్కరించినా మెరాజ్ లాంటి డెలివరీ బాయ్స్ నిరుద్యోగ సమస్యకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం జొమాటో డెలివరీ బాయ్ కస్టమర్ ఫుడ్ తిన్నాడంటూ ఇంటర్నెట్‌లో రచ్చరచ్చ చేశారు. తను అలా ఎందుకు చేశాడన్న సంగతి పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఆ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు మరో జొమాటో డెలివరీ బాయ్ కష్టాలు వైరల్‌గా మారుతున్నాయి.

Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు
ఇవి కూడా చదవండి:

LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

TRAI rules: ఛానెళ్లు సెలెక్ట్ చేసుకున్నారా? మీ కేబుల్ బిల్ ఇలా మారుతుంది

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి
First published: February 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading