LIC Plans: ఉద్యోగం చేస్తున్నారా? ఈ 5 ఎల్ఐసీ పాలసీలు మీకు బెస్ట్

మీరు ఉద్యోగం చేస్తున్నారా? మంచి పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఉద్యోగులకు ఎల్ఐసీ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.

news18-telugu
Updated: November 26, 2020, 6:37 PM IST
LIC Plans: ఉద్యోగం చేస్తున్నారా? ఈ 5 ఎల్ఐసీ పాలసీలు మీకు బెస్ట్
LIC Plans: ఉద్యోగం చేస్తున్నారా? ఈ 5 ఎల్ఐసీ పాలసీలు మీకు బెస్ట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత్‌లో ఇన్సూరెన్స్ సేవలను అందించే సంస్థల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఎల్ఐసీకి ప్రత్యేక స్థానం ఉంది. వివిధ రకాల లైఫ్‌ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఆ సంస్థ అందిస్తోంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎల్‌ఐసీ ప్రత్యేకంగా కొన్ని పాలసీలకు రూపకల్పన చేసింది. ఇంతకు ముందుతో పోలిస్తే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్‌ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. మారుతున్న ఆలోచనా ధోరణి, అనిశ్చితులు, COVID-19 వ్యాప్తి వంటివి ఇన్సూరెన్స్ పాలసీ అవసరాన్ని చాటిచెబుతున్నాయి. అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న వివిధ రకాల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను వినియోగదారులు ఎంచుకోవచ్చు. కానీ పాలసీని ఎంచుకునే వారికి వాటిపై ప్రాథమిక అవగాహన ఉండాలి. వేర్వేరు ఇన్సూరెన్స్ ప్లాన్ల గురించి తెలుసుకున్న తరువాతే, మీ అవసరానికి తగ్గ ప్లాన్‌ను ఎంచుకోవాలి. భారత్‌లో ఇన్సూరెన్స్ సేవలను అందించే సంస్థల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఎల్ఐసీకి ప్రత్యేక స్థానం ఉంది. వివిధ రకాల లైఫ్‌ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఆ సంస్థ అందిస్తోంది. ఉద్యోగాలు చేసే వారి కోసం ఎల్‌ఐసీ ప్రత్యేకంగా కొన్ని పాలసీలకు రూపకల్పన చేసింది. ప్రస్తుతం వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఎల్‌ఐసీ అందిస్తోన్న ఐదు ప్లాన్లు...

Indane Gas subsidy: ఇండేన్ గ్యాస్ సబ్సిడీ అకౌంట్లోకి రాకపోతే కంప్లైంట్ చేయండి ఇలా

LIC Aadhaar Shila Plan: మహిళల కోసం ఎల్ఐసీలో ప్రత్యేక పాలసీ... బెనిఫిట్స్ ఇవే

1. LIC Tech Term Plan


టెక్ టర్మ్ ప్లాన్ ఒక రిస్క్ ప్రీమియం ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఆన్‌లైన్ టర్మ్ పాలసీ. ఇతర ఆఫ్‌లైన్ ప్లాన్‌ల కంటే తక్కువ మొత్తంలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. పాలసీదారుడు ఈ ప్లాన్లో చెల్లించే హామీ మొత్తాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇందుకు దాదాపు 25 నుంచి 30 శాతం అధిక ప్రీమియం చెల్లించాలి. పాలసీదారుడు యక్సిడెంట్ రైడర్‌ను యాడ్ ఆన్‌ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రమాదవశాత్తూ పాలసీదారుడు చనిపోతే, వారికి వచ్చే డెత్ బెనిఫిట్స్‌ను ఒకేసారి కాకుండా ఐదు, పది, లేదా 15 సంవత్సరాల వాయిదాలలో పొందే ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.

2. LIC New Jeevan Anand


ఈ పాలసీ టెక్ టర్మ్ ప్లాన్‌ మాదిరిగానే ఉంటుంది. పాలసీ అమల్లో ఉన్న కాలంలో పాలసీదారుడు చనిపోతే, నామినీకి హామీ మొత్తం , బోనస్‌లు లభిస్తాయి. ఒకవేళ ఎలాంటి ప్రమాదాలు లేకుండా పాలసీదారుడు గడువు వరకు ప్రీమియం చెల్లిస్తే, బోనస్‌తో పాటు ప్రాథమిక మొత్తాన్ని పొందవచ్చు. ఒకవేళ ఇతర కారణాల వల్ల ప్రీమియం చెల్లించడం మానేస్తే, మొదటి అన్‌ పెయిడ్ ప్రీమియం తేదీ నుంచి రెండు సంవత్సరాలలోపు ఎప్పుడైనా పాలసీని రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇందుకు పాలసీదారుడు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని వడ్డీ, ఇతర ఛార్జీలతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ తీసుకున్నప్పటి నుంచి మూడేళ్ల వరకు పూర్తిగా ప్రీమియం చెల్లించిన తర్వాత, పాలసీని సరెండ్ చేయవచ్చు. మూడేళ్ల తరువాతే వినియోగదారులు సరెండర్ వ్యాల్యూ పొందగలరు.

LIC Jeevan Labh policy: ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే ప్రీమియం ఆపేసినా బెనిఫిట్స్ మీ సొంతం

December New Rules: డిసెంబర్‌లో అమలులోకి వచ్చే రూల్స్ ఇవే... తెలుసుకోండి

3. LIC Jeevan Amar


ఈ ప్లాన్ వినియోగదారులకు రక్షణతో పాటు పొదుపు సేవలను కూడా అందిస్తుంది. మెచూరిటీ తరువాత కూడా పాలసీదారుడు చనిపోయేంత వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని జీవన్ అమర్ ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఇది ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల కంటే మెరుగైన ఎంపిక. మహిళా ఉద్యోగులు ఈ ప్లాన్‌ను ఎంచుకుంటే 10 శాతం నుంచి 20 శాతం తగ్గింపును పొందవచ్చు. జీవన్ అమర్ ప్లాన్‌లో ఎక్కువ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకునే వారికి ఎల్‌ఐసీ మంచి డిస్కౌంట్లను అందిస్తుంది. ఒక కోటి రూపాయలకు మించి హామీ ఇచ్చే మొత్తాన్ని ఎంచుకునే పాలసీదారులు అత్యధికంగా 20శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

4. LIC Jeevan Umang


జీవన్ ఉమాంగ్ ప్లాన్‌లో ప్రీమియం చెల్లించాల్సిన గడువు ముగిసిన తరువాత నుంచి మెచూరిటీ గడువు ముగిసే వరకు వినియోగదారులు యాన్యువల్ సర్వైవల్ బెనిఫిట్స్‌ను పొందవచ్చు. ఒకవేళ ప్రమాదవశాత్తూ పాలసీదారుడు చనిపోతే ఒకే మొత్తంలో డబ్బు చెల్లిస్తారు. ఈ విభాగంలో జీమన్ ఉమాంగ్ వందేళ్ల వరకు లైఫ్ కవరేజీని అందిస్తుంది. పాలసీ గడువు ముగిసిన తరువాత వినియోగదారులకు హామీ ఇచ్చిన మొత్తంపై ఎనిమిది శాతాన్ని మనీబ్యాక్‌గా ప్రతి సంవత్సరం పొందవచ్చు. నియమ నిబంధనల ప్రకారం సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ ఎడిషన్ బోనస్ చెల్లిస్తారు. పదవీ విరమణ తర్వాత పెన్షన్ కావాలనుకునే వారికి జీవన్ ఉమాంగ్ మంచి ఎంపిక.

5. LIC Jeevan Laabh


పాలసీ మెచూరిటీ గడువు ముగిసిన తరువాత జీవన్ లాబ్ ప్లాన్ ద్వారా వినియోగదారుడు ఒకేసారి డబ్బు మొత్తాన్ని పొందవచ్చు. ఒకవేళ మెచూరిటీకి ముందే పాలసీదారుడు చనిపోతే, వారి కుటుంబానికి ఈ ప్లాన్ ఆర్థిక సహాయం అందిస్తుంది. కస్టమర్లు సింపుల్ రివర్షనరీ బోనస్‌లను పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫైనల్ ఎడిషనల్ బోనస్‌లు పొందేందుకు అర్హత ఉంటే, దాన్ని నామినీకి చెల్లిస్తారు. ప్రీమియం చెల్లించే విధానం (పేమెంట్ మోడ్) ఆధారంగా కస్టమర్లు రిబేట్ పొందవచ్చు. ఈయర్లీ మోడ్‌ను ఎంచుకుంటే టేబుల్ ప్రీమియంపై రెండు శాతం రిబేట్‌ పొందవచ్చు. ఈ ప్లాన్‌ లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. కానీ ఈ ప్రీమియం మొత్తం ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: November 26, 2020, 6:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading