పిల్లలకు చిన్నతనం నుంచే ఆర్థిక అంశాల పట్ల అవగాహన ఉంచేలా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు డబ్బు పొదుపు చేయడం, ఇన్వెస్ట్ చేయడం వంటివి నేర్పించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. పొదుపు అవసరం, పెట్టుబడులతో లాభాల గురించి పిల్లలకు అవగాహన కల్పించేందుకు తల్లిదండ్రులు కొన్ని పద్ధతులు పాటించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
సేవింగ్స్ అకౌంట్ తెరవడం
పిల్లలకు డబ్బు గురించి తెలుసుకునే వయసు రాగానే వారికోసం ఓ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తీయడం మంచిది. దీనివల్ల వాళ్లు డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేయడం వంటివన్నీ నేర్చుకుంటారు. డిపాజిట్ చేసిన మొత్తానికి ఎలా వడ్డీ వస్తుందో కూడా వారికి తెలుస్తుంది. పిల్లలకు రోజూ కొంత మొత్తాన్ని అందిస్తూ నెలనెలా ఆ మొత్తాన్ని బ్యాంకులో వేసే అలవాటు చేస్తే వారికి పొదుపు అలవడుతుంది. అంతే కాదు.. తాము పొదుపు చేసిన డబ్బుతోనే వారు వివిధ రకాల వస్తువులు కొనుక్కుంటే వారికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ అకౌంట్‌కు పెద్దలు గార్డియన్‌గా ఉండి, పిల్లల పేరుతో అకౌంట్ తీసుకోవచ్చు.
రికరింగ్ డిపాజిట్లు లేదా సిప్
పిల్లలతో రికరింగ్ డిపాజిట్లు చేయించడం వల్ల.. వారికి ప్రతినెలా డబ్బు జమ చేయడం తెలుస్తుంది. అంతే కాదు.. ఒకవేళ మీకు మ్యూచువల్ ఫండ్స్ పై అవగాహన ఉంటే పిల్లల పేరుపై కూడా సిప్ చేయవచ్చు. చిన్న మొత్తాలు దీర్ఘ కాలంలో ఎలా పెద్ద మొత్తాలుగా మారతాయన్న విషయం పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా ఇది చేస్తుంది. చిన్న పిల్లల కోసం ఇన్సూరెన్స్ సంస్థలు ఎన్నో రకాల ప్లాన్స్ తీసుకొస్తున్నాయి. వాటిని కూడా ప్రయత్నించవచ్చు.
డెబిట్ కార్డు ఇవ్వడం
పిల్లల దగ్గర క్యాష్ ఉండడం సరికాదు. అయినా వాళ్లు కూడా కార్డులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వారికి కూడా డెబిట్ కార్డు ఇవ్వవచ్చు. అంతే కాదు.. వారికి ట్రాన్సాక్షన్ లిమిట్ పెట్టి నెలకు ఇంతే మొత్తాన్ని ఉపయోగించుకోవాలని చెప్పడం వల్ల వారు తమ ఖర్చులను తగ్గించుకునే వీలుంటుంది. వీటన్నింటి అలర్ట్స్ మీ ఫోన్ కి వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల కోసం ప్రత్యేకంగా చిల్ట్రన్ కార్డ్స్ విడుదల చేస్తున్నాయి కొన్ని బ్యాంకులు.. వాటిని తీసుకోవచ్చు.
Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్.. ఆ తరువాతే అమలు చేస్తారా ?
KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?
Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం
Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి
* ఇవి గుర్తుంచుకోండి.
చిన్న పిల్లల కోసం అకౌంట్లు తీసిన తర్వాత తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
పిల్లలకు 18 సంవత్సరాల వయసు రాగానే ఈ అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి. వారు పెద్దవాళ్లు కాబట్టి వారికి సంబంధించిన కేవైసీ వివరాలను సబ్మిట్ చేసిన తర్వాతే ఇవి తిరిగి నడుస్తాయి.
పిల్లలకు ఈ వివరాలన్నీ తెలిసే అవకాశం తక్కువ కాబట్టి ఈ వివరాలన్నీ వారు అందించడంలో తల్లిదండ్రులు వారికి సాయం చేయాలి.
పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి అకౌంట్లను పిల్లల పేరు మీదే తీసే వీలుంటుంది. వారి ఉన్నత విద్య కోసం వీటిని ఉపయోగించుకునే వీలుంటుంది. నెలనెలా చాలా తక్కువ మొత్తం కట్టడం వల్ల ఎక్కువ మొత్తం ఎలా పోగుపడుతుందో దీని ద్వారా వారు కూడా గ్రహిస్తారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.