Business Ideas: ఈ బిజినెస్‌తో నెలకు రూ.50 వేల సంపాదన..365 రోజుల డిమాండ్ ఉన్న వ్యాపారం..

(ప్రతీకాత్మక చిత్రం)

టీ ఫ్రాంచైజీలు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వ్యాపారంగా మారాయి. ప్రస్తుతం మార్కెట్లో అనేక టీ ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు కేవలం కేఫ్స్, టీ బండి వరకే పరిమితం అయిన టీ వ్యాపారం, ప్రస్తుతం ఫ్రాంచైజీ స్థాయికి చేరింది.

  • Share this:
    కరోనా దెబ్బకు చాలా మంది తమ ఉపాధి అవకాశాలను కోల్పోయారు. అయితే చాలామంది ఉద్యోగాలను తిరిగి పొందడం గగనం అయిపోతోంది. అయితే బ్యాంకులు మాత్రం నిరుద్యోగుల కోసం పలు రుణాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ఉపాధి అవకాశాల కోసం చిన్న రుణాలతో వ్యాపారాల కోసం వెతుకుతున్నారు. ఎవరైతే తక్కువ పెట్టుబడితో ఒక బిజినెస్ స్టార్ట్  చేయాలి అనుకుంటున్నారో, అలాంటి వారికీ ఈ టీ ఫ్రాంచైజ్  అనేది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. మార్కెట్ లో మనకు చాల రకాల కంపెనీలు టీ ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కంపెనీల ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి అలాగే రాయల్టీ కూడా చెల్లించాలి. ఈ టీ ఫ్రాంచైజీని మీరు చాల తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఈ టీ ఫ్రాంచైజీ వారికీ మనకు జరిగే బిజినెస్ లో ఎలాంటి రాయల్టీ కూడా చెల్లించవలసిన అవసరం లేదు .

    ఇప్పుడు టీ ఫ్రాంచైజీ తీసుకోవాలి. అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, దీనికి కావలసిన అవసరాలు ఏంటి, ఈ ఫ్రాంచైజీ తీసుకుంటే మనకు కంపెనీ వారు ఎలాంటి సపోర్ట్ చేస్తుంది.  అలాగే ఎలాంటి మెటీరియల్ అందిస్తారు. ఆ మెటీరియల్ అయిపోయిన తరువాత మళ్లీ మనం ఎక్కడ తీసుకోవాలి ఇంకా ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయి  అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    టీ ఫ్రాంచైజీలు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వ్యాపారంగా మారాయి. ప్రస్తుతం మార్కెట్లో అనేక టీ ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు కేవలం కేఫ్స్, టీ బండి వరకే పరిమితం అయిన టీ వ్యాపారం, ప్రస్తుతం ఫ్రాంచైజీ స్థాయికి చేరింది. నిజానికి టీ విషయంలో వినియోగదార్ల అభిరుచుల్లో మార్పు వచ్చింది. యువతరం కొత్తదనం కోరుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొత్తగా రంగ ప్రవేశం చేస్తున్న కంపెనీలు వినూత్న ప్రయోగాలతో విభిన్న రుచుల్లో టీ పొడులను తీసుకొస్తున్నాయి. మిల్క్‌ బబుల్‌ టీ, గ్రేప్‌ ఐస్‌ టీ, లెమన్‌ ఐస్‌ టీ, కశ్మీరీ కావా, గ్రీన్‌ మ్యాంగో.. ఇలా చెప్పుకుంటూపోతే వేలాది రుచులు కస్టమర్లను ఊరిస్తున్నాయి. వీటిని ఆఫర్‌ చేసేందుకు ఇప్పుడు భారత్‌లో ఔట్‌లెట్లూ విస్తరిస్తున్నాయి. టీ వినియోగంలో ప్రపంచంలో భారత్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవలి కాలంలో చక్కెర లేని గ్రీన్‌ టీ, హెర్బల్‌ టీ, లెమన్‌ టీ వంటివి పాపులర్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీ ఫ్రాంచైజీలు తెగ పాపులర్ అవుతున్నాయి.

    చాయ్ ట్రీ, చాయ్‌ పాయింట్, ద టీ ప్లానెట్, చాయ్ బార్‌ వంటి 200 దాకా చైన్లు జాతీయ, రాష్ట్ర స్థాయిలో వేలాది టీ కేఫ్‌లతో విస్తరిస్తున్నాయి. వీటి ఫ్రాంచైజీలు 2 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే 365 రోజుల పాటు డిమాండ్ ఉండే ఈ వ్యాపారంతో నెలకు 50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ కనిష్టంగా సంపాదించుకునే వీలుంది.
    Published by:Krishna Adithya
    First published: