పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. టీడీఎస్ తగ్గింపు

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైల్ చేయాల్సిన ఆదాయపన్ను శాఖ రిటర్నులను దాఖలు చేసేందుకు ఈ ఏడాది జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ ఇన్ కం ట్యాక్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు గడువును సైత పొడిగించింది కేంద్రం. జులై 31 వరకు ఉన్న గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

  • Share this:
    ప్రత్యక్ష పన్ను చెల్లింపు దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద వారికి ఊరట కల్పించింది. ప్రస్తుతం అన్ని శ్లాబులపై ఉన్న టీడీఎస్, టీసీఎస్‌ రేట్లు 25 శాతం మేర తగ్గిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రేపటి నుంచి 2021, మార్చి 31వరకు టీడీఎస్, టీసీఎస్‌‌ రేటు తగ్గింపు అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ వెసులుబాటు వల్ల ప్రజలకు సుమారు 50 వేల కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రొఫెషనల్ ఫీజు, బ్యాంకు వడ్డీ, ఇంటి అద్దె, డివిడెండ్, కమీషన్ వంటివి కూడా తగ్గించిన TDSకి వర్తిస్తాయని వెల్లడించారు.

    అటు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు గడువును సైత పొడిగించింది కేంద్రం. జులై 31 వరకు ఉన్న గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: