Work For Home: ఆ కంపెనీ ఉద్యోగుల్లో చాలామంది మళ్లీ ఆఫీసులకు వెళ్లకపోవచ్చు.. కారణాలివే..

ప్రతీకాత్మక చిత్రం

టీసీఎస్ 25 × 25 హైబ్రిడ్ మోడల్‌కు మారేందుకు గతంలోనే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ మోడల్‌ను దశల వారీగా అమలు చేస్తూ రానున్న నాలుగేళ్లలో లక్ష్యాలు చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటోంది.

  • Share this:
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌.. తమ ఉద్యోగులను ఆఫీస్‌లకు పిలిపించాలని నిర్ణయించింది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ (Work For Home) విధానంలో ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతం మందిని ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి కార్యాలయాలకు పిలిపిస్తామని వెల్లడించింది. TCSలో ప్రస్తుతం 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం 125కి పైగా నగరాల్లో అతిపెద్ద కార్పొరేట్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే 90 శాతానికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, త్వరలోనే వారికి సెకండ్ డోస్ సైతం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ ప్రతినిధి వివరించారు.

అయితే టీసీఎస్ 25 × 25 హైబ్రిడ్ మోడల్‌కు మారేందుకు గతంలోనే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ మోడల్‌ను దశల వారీగా అమలు చేస్తూ రానున్న నాలుగేళ్లలో లక్ష్యాలు చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపిస్తోంది.

Married Woman: 5 నెలల క్రితం పెళ్లి.. ఆమె జీవితం హ్యాపీగా సాగుతుందని అనుకున్నారు.. కానీ ఇంతలోనే..

* ఏమిటీ కొత్త మోడల్?
25×25 మోడల్ (25*25 Model) ప్రకారం.. 2025 నాటికి టీసీఎస్ ఉద్యోగుల్లో 25 శాతం మంది మాత్రమే కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అంటే చాలా తక్కువ మంది ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ మోడల్ ప్రకారం ఉద్యోగి తమ వర్కింగ్ టైమ్‌లో 25% మాత్రమే ఆఫీసులో గడుపుతారు. ఈ విధానంతో ప్రసవమైన ఉద్యోగిణులు, వృద్ధులను చూసుకునే మహిళలు లబ్ధి పొందవచ్చని సంస్థ తెలిపింది.

ఈ మోడల్‌ గురించి టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపినాథన్ మాట్లాడుతూ.. ‘2025 నాటికి కంపెనీ ఉద్యోగుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే కార్యాలయాల నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఆ 25 శాతం మంది ఉద్యోగులు కూడా తమ పని గంటల్లో 25 శాతం సమయాన్ని మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది. మా కస్టమర్‌లు ఈ మోడల్‌తో సౌకర్యంగా ఉన్నారు. ఈ కొత్త 25×25 విజన్‌ ప్రకారం మా కంపెనీ 2025 నాటికి 1.12 లక్షల మంది ఉద్యోగులను మాత్రమే కార్యాలయాల నుంచి పని చేయించాలని భావిస్తోంది’ అని వివరించారు.

చీరకట్టుతో వెళ్తే అవమానిస్తారా..? ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన మహిళ.. రెస్టారెంట్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

ఈ నిర్ణయంతో ఉద్యోగుల శ్రేయస్సు, కంపెనీ ప్రొడక్టివిటీ మెరుగుపడతాయని గోపీనాథన్ తెలిపారు. ఇతర IT కంపెనీలు సైతం ఇలాంటి విధానాలను అనుసరించే అవకాశం ఉంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం, ఉత్పాదకను పెంచడం అనే రెండు కారకాల ఆధారంగానే సంస్థలు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Published by:Sumanth Kanukula
First published: