Home /News /business /

TCS WIPRO HCL TECH ALL YOU NEED TO KNOW ABOUT ATTRITION SALARY HIKES AND WFH UMG GH 2

Franklin Templeton: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ న్యూ ఫండ్‌ ఆఫర్‌ లాంచ్.. ఇందులో పెట్టుబడి పెట్టొచ్చా..?

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ న్యూ ఫండ్‌ ఆఫర్‌ లాంచ్.. ఇందులో పెట్టుబడి పెట్టొచ్చా..?

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ న్యూ ఫండ్‌ ఆఫర్‌ లాంచ్.. ఇందులో పెట్టుబడి పెట్టొచ్చా..?

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ (Franklin MF) ఇటీవలే ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్(FIBAF)ను ప్రారంభించినట్లు ప్రకటించింది. న్యూ ఫండ్ ఆఫర్ (NFO) ఆగస్టు 16 నుంచి ప్రారంభమవుతుంది.

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ (Franklin MF) ఇటీవలే ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్(FIBAF)ను ప్రారంభించినట్లు ప్రకటించింది. న్యూ ఫండ్ ఆఫర్ (NFO) ఆగస్టు 16 నుంచి ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ఎవరైనా ఫండ్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 30 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం ఉంటుంది. 2020 ఏప్రిల్‌లో ఆరు డెట్ స్కీమ్‌లను క్లోయ్‌ చేయాలని ఫ్రాంక్లిన్‌ నిర్ణయం తీసుకుంది. ఆ రెగ్యులేటరీ సంక్షోభం తర్వాత ఫ్రాంక్లిన్ ఇప్పుడు మొదటి పథకాన్ని లాంచ్‌ చేసింది. ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏవో చూద్దాం.

* ఫండ్ గురించి
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ న్యూ ఫండ్‌ ఆఫర్‌ అనేది బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌. ఫండ్ హౌస్ ప్రకారం.. న్యూ ఫండ్ అనేది దీర్ఘకాలికంగా ఈక్విటీ, డెట్‌లకు బ్యాలన్స్‌డ్‌ ఎక్స్‌పోజర్‌ కోసం వెతుకుతున్న పెట్టుబడిదారుల కోసం తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు మార్కెట్ అందించే అవకాశాలను కూడా ఇది ఉపయోగించుకుంటుంది.

* బ్లెలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌(BAF) అంటే ఏంటి?
బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్డ్ ఫండ్ లేదా BAF అనేది ఈక్విటీ, డెట్ కలిసి ఉండే హైబ్రిడ్ ఫండ్. దీన్ని డైనమిక్ అసెట్ అలోకేషన్ ఫండ్స్(DAAF) అని కూడా పిలుస్తారు. ఈ ఫండ్‌లు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి అసెట్‌ అలొకేషన్‌ డైనమిక్‌గా బ్యాలెన్స్ చేస్తాయి.

ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వర్క్‌ఫ్రం హోమ్‌తో పాటు భారీగా జీతాలు ఆఫర్..!


* BAF ఎలా పని చేస్తుంది?
ఈ ఫండ్స్ స్టాక్‌లు, సెక్యూరిటీలలో కలిసి పెట్టుబడి పెడతాయి. కొన్ని సమయాల్లో ఆర్బిట్రేజ్ కాంపోనెంట్ కూడా ఉండవచ్చు. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వీటి కేటాయింపులను మారుస్తూ ఉంటారు. ఇది ఫండ్ హౌస్ నుంచి ఫండ్ హౌస్‌కి మారుతూ ఉంటుంది. అయితే మార్కెట్‌ల ఆధారంగా ఈక్విటీ, డెట్‌లలో డైనమిక్ అలొకేషన్‌ ఉంటుంది. ఇవి మార్కెట్లు ఎంత ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి, ఎంత తక్కువలో ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటాయి.

BAF ఈక్విటీకి ఎక్స్‌పోజర్‌ను తగ్గిస్తుంది, మార్కెట్ ఓవర్‌వాల్యుయేట్ అయినప్పుడు డెట్ ప్రొడక్ట్‌లలో పెట్టుబడులను పెంచుతుంది. డెట్ ఎక్స్‌పోజర్‌ను తగ్గిస్తుంది. మార్కెట్లు తక్కువగా ఉన్నపుడు ఈక్విటీలో పెట్టుబడులను పెంచుతుంది. ఇది తక్కువ వాల్యుయేషన్‌ల ప్రయోజనాన్ని పొందడంలో సహాయపడుతుంది. గణనీయమైన రాబడిని అందిస్తుంది.



* NFOలో ఎవరు పెట్టుబడి పెట్టాలి?
ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ హెడ్ శ్వేతా రజనీ మాట్లాడుతూ.. ‘అసెట్‌ అలొకేషన్‌పై స్పష్టత లేని వారు న్యూ ఫండ్‌ ఆఫర్‌ను సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఇది బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్, ఇక్కడ ఫండ్ మేనేజర్ ఈక్విటీ, డెట్ అసెట్ క్లాస్‌లో పెట్టుబడి పెడతారు. వాటి మధ్య కేటాయింపులను సమర్థంగా నిర్వహిస్తారు. ఈక్విటీకి కేటాయింపు P/E, P/B వంటి నిర్దిష్ట వాల్యుయేషన్‌ మెజర్స్‌పై ఆధారపడి ఉంటుంది. కొన్ని సమయాల్లో ఫండ్ రిస్క్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఇండెక్స్ ఫ్యూచర్‌లకు కూడా ఎక్స్‌పోజర్‌ని తీసుకోవచ్చు. ఫండ్ లేదా కేటగిరీ పెట్టుబడిదారుల కోసం పని చేస్తుంది’ అని చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: Market, Mutual Funds, Stock Market, Stocks

తదుపరి వార్తలు