TCS Q4 Results : అదరగొట్టిన టీసీఎస్ క్యూ 4 ఫలితాలు...రూ. 8,126 కోట్ల నికర లాభం నమోదు....

tcs q4 results | శుక్రవారం మార్కెట్ ముగిసిన అనంతరం విడుదల చేసిన క్యూ4 ఫలితాల్లో 17.7 శాతం పెరుగుదల చూపించింది. అంతేకాదు నికరలాభం సైతం రూ.8126 కోట్లుగా నమోదు చేసింది.

news18-telugu
Updated: April 12, 2019, 9:34 PM IST

TCS Q4 Results | దేశీయ ఐటీ సర్వీసుల దిగ్గజం నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువరించింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన అనంతరం విడుదల చేసిన క్యూ4 ఫలితాల్లో 17.7 శాతం పెరుగుదల చూపించింది. అంతేకాదు నికరలాభం సైతం రూ.8126 కోట్లుగా నమోదు చేసింది. గత సంవత్సరం క్యూ4లో నికరలాభం రూ.6904 కోట్ల వద్ద నిలిస్తే ఈ సంవత్సరం మాత్రం 1200 కోట్లు అధికంగా నమోదయ్యింది.

అంతేకాదు, టీసీఎస్ రెవెన్యూ సైతం రూ.38010 కోట్లుగా నమోదు చేసింది. అదే సమయంలో గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ.32,075 కోట్ల వద్ద నిలిచింది.

ఇదిలా ఉంటే గడిచిన 15 క్వార్టర్లతో పోల్చితే ఈ క్వార్టర్ చాలా బలమైన రిజల్ట్స్ ఇచ్చిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అంతే కాదు రానున్న మూడు క్వార్టర్లకు సంబంధించి ఆర్డర్ బుక్ సైతం భారీగానే ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. అలాగే భారీ డీల్స్ కార్యరూపం దాల్చేందుకు సిద్ధంగా ఉందని టీసీఎస్ అంచనా వేసింది. అంతే కాదు టీసీఎస్ బోర్డు ఒక్కో షేరుపై రూ.18 రూపాయల డివిడెండ్ ప్రకటించింది.

First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...