రెడ్ కార్పెట్ స్వాగతం...H-1B వీసాల్లో టాప్-10లో TCS

హెచ్-1బీ వీసాల కోసం మొత్తం 654,360 దరఖాస్తులను డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్స్ ఆఫీస్ పరిశీలించింది. అందులో 599,782 దరఖాస్తులకు మాత్రమే ఆమోదముద్రపడింది. 8,627 దరఖాస్తులను తిరస్కరించగా, 45,951 అప్లికేషన్స్‌ని కంపెనీలే విత్‌డ్రా అయ్యాయి.

news18-telugu
Updated: October 24, 2018, 11:42 AM IST
రెడ్ కార్పెట్ స్వాగతం...H-1B వీసాల్లో టాప్-10లో TCS
ప్రతీకాత్మక చిత్రం (Reuters)
  • Share this:
హెచ్-1బీ వీసా... అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునేవారి డ్రీమ్ వీసా. ఈ వీసాకు ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ అవసరం. వీటిని ఆయా సంస్థలకు అమెరికా ప్రభుత్వం ఇస్తుంది. అలా హెచ్-1 బీ వీసాల కోసం ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ పొందిన టాప్ 10 సంస్థల్లో భారతదేశం నుంచి ఒకే ఒక్క కంపెనీ ఉంది. అదే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్). సెప్టెంబర్ 30న ముగిసిన 2018 అమెరికా ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం టీసీఎస్ 20,755 ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్‍‌లు పొందింది. టాప్ 10 జాబితాలో టీసీఎస్‌ది 7వ స్థానం.

హెచ్-1బీ వీసాల కోసం ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్‍‌లు పొందిన టాప్-10 లో సంస్థలివే...
1. ఎర్నెస్ట్ అండ్ యంగ్-1,51,564

2. డెలాయిట్ కన్సల్టింగ్- 69,869
3. కాగ్నిజంట్ టెక్నాలజీ కార్ప్- 47,732


4. హెచ్‌సీఎల్ అమెరికా- 42,820
5. కే ఫోర్స్ ఇంక్- 32,9966. యాపిల్- 26,833
7. టీసీఎస్- 20,755
8. క్వాల్కమ్ టెక్నాలజీస్- 20,723
9. ఎంఫసిస్ కార్పొరేషన్- 16,671
10. క్యాప్‌జెమిని అమెరికా- 13,517

హెచ్-1బీ వీసాల్లో టాప్-10లో టీసీఎస్, TCS Only Indian Company Among Top 10 of Coveted H-1B Visa List
ప్రతీకాత్మక చిత్రం


హెచ్-1బీ వీసాల కోసం మొత్తం 654,360 దరఖాస్తులను డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్స్ ఆఫీస్ పరిశీలించింది. అందులో 599,782 దరఖాస్తులకు మాత్రమే ఆమోదముద్రపడింది. 8,627 దరఖాస్తులను తిరస్కరించగా, 45,951 అప్లికేషన్స్‌ని కంపెనీలే విత్‌డ్రా అయ్యాయి. ఉద్యోగుల సామర్థ్యాలు, నైపుణ్యాల ఆధారంగా హెచ్-1 బీ వీసాలను జారీ చేస్తుంది అమెరికా ప్రభుత్వం. ఈ వీసాలు పొందినవారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులే. ఇప్పటివరకు హెచ్-1 బీ వీసాలు పొందిన వారిలో కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్(176,025), కంప్యూటర్ ఆక్యుపేషన్స్ (120,736), సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ (67,262), అకౌంటెంట్స్, ఆడిటర్స్ (54,2410) కంప్యూటర్ ప్రోగ్రామర్స్ (53,727) మంది ఉన్నారు. ఏడాదికి 65,000 హెచ్-1 బీ వీసాలు మాత్రమే ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా ఉన్నత విద్య చదివిన వారికి 20,000 వీసాలు ఇస్తోంది.

ఇవి కూడా చదవండి:

'మాస్క్‌డ్ ఆధార్' గురించి మీకు తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్‌ బుకింగ్స్ ప్రారంభం!

క్రెడిట్ లిమిట్ అంటే ఏంటీ? ఆర్థిక క్రమశిక్షణలో ఎంత ముఖ్యం?

రిలయెన్స్ డిజిటల్ స్టోర్లల్లో వన్‌ప్లస్ 6టీ సేల్స్!

పేటీఎంలో మీ డబ్బు ఎంత సేఫ్?

నవంబర్ 20 లోపే రెడ్‌మీ నోట్ 6 ప్రో లాంఛింగ్!

షావోమీ దివాళీ సేల్‌లో ఆఫర్లివే!

వాట్సప్ డేటా బ్యాకప్: నవంబర్ 12 డెడ్‌లైన్!

కల్తీ పాలను ఎలా గుర్తించాలి? ఈ టిప్స్ ఫాలో అవండి!

 
First published: October 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>