IT Recruitments: టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో నియామకాల్లో 163 శాతం పెరుగుదల..కారణం ఇదే...

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రీ-కొవిడ్‌ స్థాయితో పోల్చితే ఐటీ రంగంలో నిపుణులైన ఉద్యోగుల నియామకాల్లో 52 శాతం పెరుగుదల కనిపిస్తోంది. అంతే కాదు జూన్‌ 2021 నాటి గణాంకాలను గతేడాది లెక్కలతో పోల్చితే 163 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను క్వెస్‌ అనే సంస్థ క్రోడికరించింది.

  • Share this:
ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీల్లో నిపుణుల (ప్రొఫెషనల్స్) అవసరాలు బాగా పెరిగిపోయాయి. ఈ కారణంగా డిమాండ్‌-సరఫరా బ్యాలెన్స్‌ కూడా దెబ్బతింటోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు చేజారిపోకుండా చూడటంపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో ప్రీ-కొవిడ్‌ స్థాయితో పోల్చితే ఐటీ రంగంలో నిపుణులైన ఉద్యోగుల నియామకాల్లో 52 శాతం పెరుగుదల కనిపిస్తోంది. అంతే కాదు జూన్‌ 2021 నాటి గణాంకాలను గతేడాది లెక్కలతో పోల్చితే 163 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను క్వెస్‌ అనే సంస్థ క్రోడికరించింది.

ఐటీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉండే బెంగళూరు, హైదరాబాద్‌, పుణే వంటి నగరాల్లో నియామక ప్రక్రియలో రెండంకెల వృద్ధి కనిపిస్తోంది. అంటే, ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాల పునరుద్ధరణ సమాన స్థాయిలో జరుగుతోందనే విషయం తేటతెల్లమవుతోంది. నిపుణులైన ఉద్యోగుల కోసం నిరంతర డిమాండ్‌ ఉందని ఐటీ రంగం తెలియజేస్తోంది.

అంతర్జాతీయ సంస్థలు దేశవ్యాప్తంగా తమ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో పాటు ఇక్కడి సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తుండటం అభివృద్ధిపరంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను తెలియజేస్తోందని క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ సంస్థ సీఈఓ విజయ్‌ శివరామ్‌ తెలిపారు. అయితే పెరుగుతున్న నైపుణ్య అవసరాల కోసం కొన్ని కంపెనీలు భారత్‌ వెలుపల అంటే ఫిలిప్పీన్స్‌, వియత్నాం, శ్రీలంక వంటి దేశాల్లో అన్వేషణ చేస్తున్నాయని వివరించారు.

చాలా కంపెనీలు కొత్త తరం ఫ్లాట్‌ఫామ్స్‌ నిర్మిస్తుండటం, మరో వైపు తమ వారసత్వాన్ని సమూల మార్చుకునే ప్రయత్నాల్లో ఉండటం వల్ల సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యానికి డిమాండ్‌ బాగా పెరుగుతోంది. అందుకే నైపుణ్య ఆధారిత నియామకాల్లో కొత్త తరహా విధానం ‘హైర్‌-ట్రెయిన్‌-డిప్లాయ్‌’ వంటి వాటిపై దృష్టి సారిస్తూ డిమాండ్‌-సప్లై అంతరాలు తగ్గించేందుకు హెచ్‌ఆర్‌ సంస్థలు కృషి చేస్తున్నాయి.

మార్చి – ఆగస్టు 2021 డేటాను విశ్లేషించిన క్వెస్‌.. ఫుల్‌-స్టాక్‌, రియాక్ట్‌ జెఎస్‌, ఆండ్రాయిడ్‌, యాంగ్యూలర్‌ జెఎస్‌, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ టెక్నాలజీస్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి డిజిటల్‌ స్కిల్స్‌కు చాలా డిమాండ్‌ ఉందని తెలిపింది. అటు నియామకాల విషయానికి వస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి సంస్థలు ఈ ఏడాది ఒక లక్ష కంటే ఎక్కువ మంది కాలేజీ ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నాయి. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్స్‌కు అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉంది టీసీఎస్‌.

మరో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 35,000 మంది కాలేజీ ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని తెలిపింది. అటు డిజిటల్‌ నెపుణ్యాన్ని డిమాండ్‌ తీవ్రతరం కావడంతో ఉన్న ఉద్యోగులను నిలబెట్టుకోవడం కంపెనీలకు పెను సవాల్‌గా మారింది.
Published by:Krishna Adithya
First published: