news18-telugu
Updated: November 26, 2020, 6:49 PM IST
ఫకీర్ చంద్ కోహ్లీ
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యవస్థాపకులు, ఆ సంస్థ మొట్టమొదటి సీఈవో అయిన ఫకీర్ చంద్ కోహ్లీ కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. ఫకీర్ చంద్ కోహ్లీని భారతీయ ఐటీ ఇండస్ట్రీ పితామహుడిగా భావిస్తారు. టాటా ఎలక్ట్రీక్ విభాగంలో పనిచేసిన ఫకీర్ చంద్ కోహ్లీ 1991లో ఐబీఎం సంస్థను భారత్‌కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. టాటా - ఐబీఎం జాయింట్ వెంచర్ ద్వారా భారత్‌లో హార్డ్‌వేర్ తయారీని ప్రారంభించేందుకు కృషి చేశారు. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ పితామహుడిగా పిలుచుకునే ఫకీర్ చంద్ కోహ్లీ భారత్‌లో టెక్నాలజీ ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించారు. భారత్‌లో ఐటీ ఇండస్ట్రీని 100 బిలియన్ డాలర్లకు పెంచిన ఘనత ఆయనకు దక్కుతుంది. టీసీఎస్ ఫౌండర్, ఫస్ట్ సీఈవోగా విశిష్ట సేవలు అందించిన ఫకీర్ చంద్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత వయోజన విద్య మీద దృష్టి పెట్టారు. ఎప్పుడూ బడి ముఖం కూడా చూడని వారు, స్కూల్ చదువులు మానేసి పెద్దవారు కూడా మళ్లీ పలక, బలపం పట్టి చదువుకునేలా విద్యను ప్రోత్సహించారు. ఆ రకంగా అక్షరాసత్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
నా దేశానికి నేను అందించిన అత్యున్నత సేవ అదే. అక్షరాస్యత వృద్ధి చెందడానికి ప్రభుత్వానికి సాయం చేశా. వారి కోసమే డిజైన్ చేసిన విధానం ద్వారా ఎప్పుడూ కనీసం స్కూల్‌కు వెళ్లని వారు కూడా మెల్లమెల్లగా చిన్నగా చదవడం, ఆ తర్వాత రాయడం నేర్చుకుంటారు.’ అని అక్టోబర్ 2, 2020న మనీ కంట్రోల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ తెలిపారు.
ఫకీర్ చంద్ కోహ్లీ 1951 సంవత్సరంలో టాటా ఎలక్ట్రిక్ కంపెనీల్లో చేరారు. లోడ్ డిస్పాచ్ సిస్టమ్‌ను నెలకొల్పడంలో కీలకంగా వ్యవహరించారు. దాని ద్వారా కంపెనీ ఆపరేషన్స్ సులువుగా మారింది. ఆ తర్వాత 1970లో ఆయన కంపెనీ డైరెక్టర్ అయ్యారు. అనంతరం టీసీఎస్ మొట్టమొదటి సీఈవోగా నియమితులయ్యారు. 1999లో 75 ఏళ్ల వయసులో ఆయన రిటైర్ అయ్యారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 26, 2020, 6:37 PM IST