Home /News /business /

TAXPAYERS WHO ARE EARNING OVER RS 1300000 PER YEAR CAN BENEFIT WITH NEW TAX REGIME KNOW HOW SS

Income Tax: జీతం ఎక్కువైనా పన్ను కట్టేది తక్కువే... కొత్త విధానాన్ని అర్థం చేసుకోండి ఇలా

Income Tax: జీతం ఎక్కువైనా పన్ను కట్టేది తక్కువే... కొత్త విధానాన్ని అర్థం చేసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Income Tax: జీతం ఎక్కువైనా పన్ను కట్టేది తక్కువే... కొత్త విధానాన్ని అర్థం చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

New Tax vs Old Tax | కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రకటించిన తర్వాత ట్యాక్స్‌పేయర్స్‌లో అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఏ పన్ను విధానం ఎంచుకుంటే మంచిది? మినహాయింపులు వదులుకుంటే లాభమా నష్టమా? అని లెక్కలేస్తున్నారు. పాత, కొత్త పన్ను విధానాలను ఇలా అర్థం చేసుకోండి.

ఇంకా చదవండి ...
    ఆదాయం ఎక్కువగా ఉన్నవారు పన్ను చెల్లించాల్సిందే. అయితే ప్రభుత్వం నుంచి కొన్ని మినహాయింపులు తీసుకుంటే పన్ను చెల్లించకుండా ఉండొచ్చు. ఒకవేళ జీతం ఎక్కువగా ఉన్నా పన్ను తక్కువగానే చెల్లించొచ్చు. ఇలా చెబుతోంది ఎవరో కాదు... ప్రభుత్వమే. రూ.12,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవారు రూ.2,00,000 వరకు మినహాయింపులు, తగ్గింపులు పొందుతున్నట్టైతే వారికి కొత్త పన్ను విధానం కన్నా పాత పన్ను విధానమే ఉపయోగకరంగా ఉంటుంది. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, ప్రావిడెంట్ ఫండ్, హోమ్ లోన్ వడ్డీ, నేషనల్ పెన్షన్ స్కీమ్, లైఫ్ ఇన్స్యూరెన్స్, మెడికల్ ఇన్స్యూరెన్స్ లాంటి మినహాయింపులు ఉన్నాయి. వాటిని పొందొచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5.78 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల్లో 5.3 కోట్ల మంది ఏటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో రూ.2,00,000 వరకు మినహాయింపులు పొందుతున్నారు. అంటే 90 శాతం మంది ట్యాక్స్ పేయర్స్ రూ.2,00,000 లోపు మినహాయింపులు పొందుతున్నారు.

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన కొత్త శ్లాబ్స్ చూస్తే రూ.2,50,000 నుంచి రూ.5,00,000 వరకు 5% పన్ను, రూ.5,00,000 నుంచి రూ.7,50,000 వరకు 10% పన్ను, రూ.7,50,000 నుంచి రూ.10,00,000 వరకు 15% పన్ను, రూ.10,00,000 నుంచి రూ.12,50,000 వరకు 20% పన్ను, రూ.12,50,000 నుంచి రూ.15,00,000 వరకు 25% పన్ను, రూ.15,00,000 కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి 30% పన్ను చెల్లించాలి. ఈ కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఎలాంటి మినహాయింపులు, తగ్గింపులు పొందనివారికే ఈ కొత్త పన్ను విధానం ఉపయోగకరంగా ఉంటుంది.

    ఉదాహరణకు ఓ వ్యక్తి వార్షికాదాయం రూ.13,00,000 కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు పాత పన్ను విధానంలో రూ.2,00,000 మినహాయింపులు తీసుకుంటే రూ.1,48,200 పన్ను చెల్లించాలి. అదే కొత్త పన్ను విధానంలో మినహాయింపులు అన్నీ వదులుకున్నా రూ.1,43,000 పన్ను చెల్లిస్తే చాలు. అంటే రూ.5,200 ఆదా అవుతుంది. ఒకవేళ వార్షికాదాయం రూ.14,00,000 అయితే రూ.10,400, వార్షికాదాయం రూ.15,00,000 అయితే రూ.15,600 ఆదా అవుతుంది. వేతనం ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో ఆదాయం పొందేవారు వార్షికంగా రూ.9,50,000 సంపాదిస్తూ, రూ.1,50,000 మినహాయింపులు పొందుతున్నట్టైతే వారు కూడా కొత్త పన్ను విధానంతో రూ.5,200 ఆదా చేయొచ్చు. అంటే... వార్షికాదాయం ఎక్కువగా ఉన్నవారి కొత్త పన్ను విధానం ఉపయోగకరంగా ఉంటుంది. వార్షికాదాయం తక్కువగా ఉండి, స్టాండర్డ్ డిడక్షన్, ప్రావిడెంట్ ఫండ్, హోమ్ లోన్ వడ్డీ, నేషనల్ పెన్షన్ స్కీమ్, లైఫ్ ఇన్స్యూరెన్స్, మెడికల్ ఇన్స్యూరెన్స్ లాంటి మినహాయింపులు పొందాలనుకుంటే పాత పన్ను విధానాన్నే ఎంచుకోవడం మంచిది.

    ఇవి కూడా చదవండి:

    Digital Cash: ఈ టిప్స్‌తో మీ పేటీఎం, ఫోన్‌ పేలో డబ్బులు సేఫ్

    Auto Sweep: ఈ టెక్నిక్ తెలిస్తే... మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబుల్ వడ్డీ

    EPF: ఎక్కువ జీతం ఉన్నవారికి త్వరలో షాక్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Budget, Budget 2020, Business, BUSINESS NEWS, Income tax, Investment Plans, Nirmala sitharaman, Personal Finance, Save Money, TAX SAVING, Union Budget 2020, Union budget 2020-2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు