హోమ్ /వార్తలు /బిజినెస్ /

ITR Intimations: ఐటీఆర్ ఇంటిమేషన్‌ నోటీస్‌కు రెస్పాండ్ అవ్వకపోతే 200% పెనాల్టీ.. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే.. ?

ITR Intimations: ఐటీఆర్ ఇంటిమేషన్‌ నోటీస్‌కు రెస్పాండ్ అవ్వకపోతే 200% పెనాల్టీ.. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే.. ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐటీఆర్ ఇంటిమేషన్ నోటీసులకు ట్యాక్స్ పేయర్ రెస్పాండ్ అవ్వకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ITR ఫైల్ చేయనట్లు కూడా ఆదాయ పన్ను శాఖ పరిగణించే అవకాశం ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ట్యాక్స్ పేయర్ ఫైల్ చేసే ఆదాయ పన్ను రిటర్న్‌లోని (ITR) వివరాలను ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చెక్ చేస్తుంది. అందులో ఏవైనా లోపాలను, మోసాలను గుర్తిస్తే.. వాటి గురించి నోటీసు పంపుతుంది. ఇలా ఫారం 16లో పేర్కొన్న డిడక్షన్‌ అమౌంట్‌, దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్న్(ITR)లో ఆదాయ పన్ను శాఖ ఏదైనా తేడాలను గుర్తిస్తే.. ట్యాక్స్ పేయర్‌కు ఇంటిమేషన్‌ నోటీసు పంపుతుంది. ఈ ఇంటిమేషన్‌లు ఆటోమేటిక్‌గా జనరేట్‌ అవుతాయి. అయితే వీటికి ఎలా స్పందించాలనే దానిపై పన్ను చెల్లింపుదారులు అందరికీ అవగాన ఉండకపోవచ్చు. ఇలాంటి నోటీసులకు రెస్పాండ్ అవ్వకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ITR ఫైల్ చేయనట్లు కూడా ఆదాయ పన్ను శాఖ పరిగణించే అవకాశం ఉంది.

200 శాతం జరిమానా

ITR నోటీసులకు రెస్పాండ్ అవ్వకపోతే.. తక్కువగా పేర్కొన్న ఇన్‌కమ్‌పై చెల్లించాల్సిన పన్ను మొత్తంపై 200 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. ఇలాంటివి సున్నితమైన రిమైండర్లు అని పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాలి. ఒకవేళ ట్యాక్స్ పేయర్ క్లెయిమ్ చేసిన డిడక్షన్స్‌ సరైనవి అయితే, వారు ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అయి, క్లెయిమ్‌లు సరైనవేనని సమాధానం ఇవ్వవచ్చు. ఇంటిమేషన్‌ అందుకున్న 15 రోజులలోపు దీనికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

ITR Notice: ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసు వచ్చిందా..? అయితే, ఏం చేయాలో తెలుసుకోండి..

లోపాలను సరిదిద్దాలి

సమస్యలకు చెక్ పెట్టేందుకు పన్ను చెల్లింపుదారులు డిడక్షన్స్‌ రుజువును సిద్ధంగా ఉంచుకోవాలని AKM గ్లోబల్ ట్యాక్స్ కన్సల్టింగ్ సంస్థ టాక్స్ మార్కెట్స్ హెడ్ యీషు సెహగల్ సూచిస్తున్నారు. ఏదైనా తప్పు క్లెయిమ్‌లు/పొరపాటుల విషయంలో, ఈమెయిల్/ఇంటిమేషన్‌లో పేర్కొన్న సమయం లోపు రెస్పాండ్ అవ్వకపోతే.. పన్ను చెల్లింపుదారుడు తక్కువగా పేర్కొన్న ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను మొత్తంలో 200 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సెహగల్ సీఎన్‌బీసీతో చెప్పారు. అంతేకాక ఆదాయ పన్ను రిటర్నులను కూడా సవరించాల్సి ఉంటుంది. అందుకే పన్ను చెల్లింపుదారులు వెంటనే సంబంధిత శాఖను సంప్రదించి లోపాలను సరిదిద్దడానికి కృషి చేయాలి.

అదనపు ట్యాక్స్ రీఫండ్

పన్ను చెల్లింపుదారులు అదనంగా చెల్లించే పన్ను విషయంలో, ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్యాక్స్‌ రీఫండ్‌ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా లేదా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ఈ-గవర్నెన్స్ వెబ్‌సైట్ ద్వారా - tin.tin.nsdl.com ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో రీఫండ్ స్టేటస్‌ ఎలా చెక్‌ చేయాలి?

ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా రీఫండ్‌ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో ‘స్టేటస్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ రీఫండ్స్‌’ ట్యాబ్‌పై క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పేమెంట్‌ మోడ్‌, రిఫరెన్స్ నంబర్, స్టేటస్‌, రీఫండ్‌ స్టేటస్‌ తేదీని తెలియజేస్తూ ఓ మెసేజ్‌ కనిపిస్తుంది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) - tin.tin.nsdl.com ఇ-గవర్నెన్స్ వెబ్‌సైట్‌లో కూడా స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Income tax, ITR

ఉత్తమ కథలు