Home /News /business /

TAXES ON CRYPTO BUSINESS MAY BE CONSIDERED IN THE BUDGET TO BRING THEM UNDER SPECIAL MK

Budget 2022: క్రిప్టో కరెన్సీలపై ఈ బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకునే చాన్స్...30 శాతం టాక్స్ విధిస్తారా..నిపుణులు ఏమంటున్నారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాబోయే కేంద్ర బడ్జెట్‌లో క్రిప్టోకరెన్సీల కొనుగోలు , విక్రయాలను పన్ను పరిధిలోకి తీసుకు వచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే టాక్స్ నిపుణులు ఈ విషయంపై క్లూస్ ఇస్తున్నారు. రాబోయే బడ్జెట్‌లో నిర్దిష్ట పరిమితికి మించి క్రిప్టోకరెన్సీల అమ్మకం , కొనుగోలుపై TDS/TCS విధించే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    రాబోయే కేంద్ర బడ్జెట్‌లో క్రిప్టోకరెన్సీల కొనుగోలు , విక్రయాలను పన్ను పరిధిలోకి తీసుకు వచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే టాక్స్ నిపుణులు ఈ విషయంపై క్లూస్ ఇస్తున్నారు. రాబోయే బడ్జెట్‌లో నిర్దిష్ట పరిమితికి మించి క్రిప్టోకరెన్సీల అమ్మకం , కొనుగోలుపై TDS/TCS విధించే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. క్రిప్టో లావాదేవీలను ప్రత్యేక లావాదేవీల పరిధిలోకి తీసుకురావాలని టాక్స్ నిపుణుడు అరవింద్ శ్రీవత్సవ్ అన్నారు. ఆదాయపు పన్ను అధికారులు సైతం ఈ సమాచారాన్ని పొందే వీలుంది. ప్రస్తుతం దేశంలో పెద్ద సంఖ్యలో క్రిప్టో లావాదేవీలను చేస్తున్న వారు ఉన్నారు. అదే సమయంలో, క్రిప్టోకరెన్సీల విక్రయం ద్వారా వచ్చే ఆదాయానికి లాటరీలు, గేమ్ షోలు, పజిల్స్ వంటి 30 శాతం అధిక పన్ను రేటుతో పన్ను విధించే వీలుందని శ్రీవత్సవ్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 100.7 మిలియన్ క్రిప్టో మదుపరులు ఉన్నారని, ఒక నివేదిక ప్రకారం, భారతీయులు క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడి 2030 నాటికి 241 మిలియన్ డాలర్లకు పెరగవచ్చని శ్రీవత్సవ్ అంచనా వేశారు.

    రాబోయే సాధారణ బడ్జెట్‌పై శ్రీవత్సవ్ పిటిఐతో మాట్లాడుతూ, “క్రిప్టోకరెన్సీని నియంత్రించడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టాలని భావించారు. అయితే, అది ప్రవేశపెట్టలేదు , ఇప్పుడు ప్రభుత్వం బడ్జెట్ సెషన్‌లో ఆ బిల్లును తీసుకురావచ్చని భావిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలలో వ్యాపారం చేయకుండా ప్రభుత్వం భారతీయులను నిషేధించడం కుదరని పని అని, ప్రభుత్వం క్రిప్టోకరెన్సీల కోసం కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

    క్రిప్టో కొనుగోలు , అమ్మకం రెండింటిపై నిఘా...
    క్రిప్టోకరెన్సీలతో సంబంధం ఉన్న రిస్క్‌ను పరిగణనలోకి తీసుకుంటే, TDS, TCS పరిధిలోకి తీసుకురావడం వంటి కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్రిప్టోకరెన్సీల విక్రయం , కొనుగోలు రెండింటినీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ స్టేట్‌మెంట్ (SFT) పరిధిలోకి తీసుకురావాలని కూడా ఆయన అన్నారు. ఇలా చేయడం క్రిప్టో కరెన్సీల లావాదేవీలను పర్యవేక్షించవచ్చని తేలింది. లాటరీలు, గేమ్ షోలు, పజిల్స్ మొదలైన వాటి తరహాలో క్రిప్టోకరెన్సీల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం ఎక్కువ పన్ను విధించడం ద్వారా క్రిప్టోలను నియంత్రించే వీలుందని శ్రీవత్సవ్ అంచనా వేస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Cryptocurrency

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు