ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చేసరికి అందరికీ ట్యాక్స్ టెన్షన్ పట్టుకుంటుంది. పన్ను మినహాయింపులు ఎలా పొందాలి? వీలైనంతవరకు పన్నులు ఎలా తగ్గించుకోవాలి? అని తెగ చర్చిస్తుంటారు. అయితే ఆదాయపు పన్ను శాఖ అనేక రకాల పన్ను మినహాయింపుల్ని ఇస్తుంది. కానీ అవి అర్థం కాక చాలామంది ఉపయోగించుకోరు. కేవలం వృద్ధుల కోసం చాలా రకాల పన్ను మినహాయింపులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటే పన్నుల్ని వీలైనంతవరకు తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం వృద్ధుల్ని రెండు కేటగిరీల్లో విభజించారు.
1. సీనియర్ సిటిజన్- ఆర్థిక సంవత్సరం సమయంలో 60 నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు.
2. వెరీ సీనియర్ సిటిజన్- ఆర్థిక సంవత్సరం 80 ఏళ్ల వయస్సు దాటినవాళ్లు.
సీనియర్ సిటిజన్, వెరీ సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపులు వేర్వేరుగా ఉంటాయి. ఈ చార్ట్ చూడండి.
వృద్ధులకు కూడా సర్ఛార్జ్, ఎడ్యుకేషన్ సెస్(4%) వర్తిస్తుంది.
మొత్తం ఆదాయం రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి ఉంటే 10% పన్ను చెల్లించాలి.
మొత్తం ఆదాయం రూ.1 కోటి దాటితే 15% పన్ను చెల్లించాలి.
Read this:
ఎల్ఐసీ నుంచి మీకు రావాల్సిన డబ్బులు బ్లాక్ అయ్యాయా? కారణాలు ఇవే...
డిపాజిట్లపై వచ్చే వడ్డీలపై వృద్ధులకు పన్ను మినహాయింపులు
ఫిక్స్ఢ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ రిటైర్మెంట్ తర్వాత వృద్ధులకు ప్రధాన ఆదాయం అవుతుంది. అందుకే వీటిపై పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రూ.50,000 లోపు ఉంటే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వడ్డీకి రూ.10,000 వరకు మినహాయింపు ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూ.50,000 దాటితే బ్యాంకులు టీడీఎస్ డిడక్ట్ చేస్తాయి. అంతలోపు వడ్డీ ఉంటే మినహాయింపు కోసం 15H ఫామ్ ఫిల్ చేసి బ్యాంకులో ఇవ్వాలి.
ఆరోగ్యం, వైద్య ఖర్చులపై మినహాయింపులు
వయస్సు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులూ పెరుగుతాయి. సీనియర్ సిటిజన్లు రూ.50,000 వరకు వైద్య ఖర్చులు, ఆరోగ్య బీమా ప్రీమియంపై మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తే వైద్య ఖర్చులపై రూ.1 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.
Read this:
PMSYM Scheme: మీ జీతం రూ.15 వేల కన్నా తక్కువా? ఈ పెన్షన్ స్కీమ్ మీ కోసమే...
పెన్షన్‌పై పన్నులు
పెన్షన్‌ను కూడా వేతనంలాగే భావిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. అయితే గతేడాది స్టాండర్డ్ డిడక్షన్ ప్రవేశపెట్టింది. పెన్షన్ ఆదాయంపై రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు పొందొచ్చు. సీనియర్ సిటిజన్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఏదైనా పన్ను చెల్లించాల్సి ఉంటే నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంది. మిగతా పన్నుల విషయంలో ఇతరులకు ఎలాంటి మినహాయింపులు ఉంటాయో వృద్ధులకూ అవి ఉంటాయి.
Photos: రూ.50 కోట్లతో 6 రోల్స్ రాయిస్ కార్లు... తలపాగాతో మ్యాచింగ్...
ఇవి కూడా చదవండి:
Business Idea: రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ.14 వేల ఆదాయం
SBI Card: మీ ఎస్బీఐ కార్డు పోయిందా? వెంటనే ఇలా బ్లాక్ చేయొచ్చు
Flipkart TV Days: టీవీ కొనాలా? ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్స్ ఇవే...