మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి కొన్ని మార్పులను ప్రభుత్వం ప్రతిపాదించింది. పార్లమెంటులో 2021 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాక్స్ చెల్లించేవారు కొత్త నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ట్యాక్స్ చెల్లింపుదారులు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయి. అవేంటంటే..
* 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన ITR (ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్) దాఖలు చేసేందుకు గడువు మార్చి 31 వరకే ఉంది. గతంలో దాఖలు చేసిన ఐటీఆర్‌లో తప్పులు ఉంటే, సవరించిన రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి(మార్చి 31) గడువు పూర్తవుతుంది.
* 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఈ మార్చి 31 చివరి తేదీగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇప్పటికే ఈ గడువును చాలాసార్లు పొడిగించారు. ఇంకా రిటర్నులు దాఖలు చేయని వారు మార్చి 31లోగా ఆలస్య రుసుంతో పాటు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
e-PAN Card: పాన్ కార్డ్ లేదా? 10 నిమిషాల్లో ఇ-పాన్ కార్డ్ తీసుకోండి ఇలా
Aadhaar Card Address Update: అడ్రస్ ప్రూఫ్ లేదా? అయినా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చండి ఇలా
* పాన్ కార్డు, ఆధార్ కార్డులను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇందుకు చివరి గడువు మార్చి 31. ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు మార్చి 31 తర్వాత చెల్లుబాటు కావు.
* 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదనే నిబంధన కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. వీరికి ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. పెన్షన్, వడ్డీల ద్వారా తప్ప ఇతర ఆదాయ మార్గాలు లేని వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.
* వివాద్ సే విశ్వాస్ పథకం చెల్లింపులకు గడువు మార్చి 31 వరకే ఉంది. ఈ పథకం కింద లబ్ధిదారులు నిర్ణీత సమయంలోపు డిక్లరేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అదనపు వడ్డీ లేకుండా ట్యాక్స్ చెల్లించేందుకు ఏప్రిల్ 30 వరకు గడువు ఉంది.
April Bank Holidays: ఏప్రిల్‌లో ముఖ్యమైన లావాదేవీలున్నాయా? బ్యాంకులకు 12 రోజులు సెలవులు
New Rules in April: ఏప్రిల్‌లో అమల్లోకి వస్తున్న 12 కొత్త రూల్స్ ఇవే... మీపై ప్రభావం ఎంతంటే
* ఏప్రిల్ 1 నుంచి ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు (ఉద్యోగులు) సంవత్సరానికి రూ.2.5 లక్షలకు మించి చేసే పీఎఫ్ కంట్రిబ్యూషన్లపై ప్రభుత్వం ట్యాక్స్ విధించనుంది.
* ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్లకు చివరి తేదీ కూడా మార్చి 31 కావడం విశేషం. ఇన్‌కం ట్యాక్స్ నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన కొన్ని పెట్టుబడులపై ట్యాక్స్ ఆదా అవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇలా ట్యాక్స్ ఆదా చేసుకోవడానికి మార్చి 31 లోపు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న అనేక ఇనుస్ట్రుమెంట్లలో లబ్ధిదారులు పెట్టుబడి పెట్టవచ్చు.
* 2021 బడ్జెట్‌లో ఉద్యోగులకు ఉపశమనం కలిగించే ప్రకటనలు కొన్ని ఉన్నాయి. LTCకి బదులుగా ఉద్యోగులకు ఇచ్చే మొత్తాన్ని ట్యాక్స్ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.
* TDS నిబంధనల్లో మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయని వారి నుంచి అధిక TDS లేదా TCS వసూలు చేస్తారు. 2021 బడ్జెట్లో ప్రభుత్వం దీన్ని ప్రకటించింది.
* కొత్త ఆర్థిక సంవత్సరంలో ముందుగా నింపిన ఆదాయపు పన్ను రిటర్నులను (ప్రీ- ఫిల్డ్ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ) అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది ట్యాక్స్ చెల్లించేవారి ఇబ్బందులను దూరం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Income tax, Personal Finance