Tax Saving: ఇన్స్యూరెన్స్ పాలసీతో ట్యాక్స్ ఆదా... ఇలా చేయొచ్చు

Tax Saving | మీరు స్వయంగా తీసుకున్న పాలసీలు, జీవిత భాగస్వామి లేదా పిల్లలపై తీసుకున్న పాలసీలనూ పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేయొచ్చు. టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్, ఎండోమెంట్, మనీబ్యాక్, యూలిప్ ప్లాన్స్‌కు ఇది వర్తిస్తుంది.

news18-telugu
Updated: March 18, 2019, 12:18 PM IST
Tax Saving: ఇన్స్యూరెన్స్ పాలసీతో ట్యాక్స్ ఆదా... ఇలా చేయొచ్చు
Tax Saving: ఇన్స్యూరెన్స్ పాలసీతో ట్యాక్స్ ఆదా... ఇలా చేయొచ్చు
news18-telugu
Updated: March 18, 2019, 12:18 PM IST
మీరు పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? మీరు ఏదైనా ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నారేమో గుర్తు తెచ్చుకోండి. లేదంటే ఇన్స్యూరెన్స్ ప్లాన్ ద్వారా ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. ఇందుకోసం మీరు పన్నుల్ని అర్థం చేసుకోవాలి. ఆదాయపు పన్ను చట్టం 1961లో సెక్షన్ 80సీ, 80డీలను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే చాలావరకు పన్ను ఆదా చేయొచ్చు. మరి ఆ సెక్షన్లు ఏంటీ? మీరు పన్ను ఆదా చేయడానికి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలి? తెలుసుకోండి.

సెక్షన్ 80సీ


ఆదాయపు పన్ను చట్టం 1961లో సెక్షన్ 80సీ కింద మీకు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్‌ ప్లాన్స్ కోసం చెల్లించే ప్రీమియంలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. మీరు స్వయంగా తీసుకున్న పాలసీలు, జీవిత భాగస్వామి లేదా పిల్లలపై తీసుకున్న పాలసీలనూ పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేయొచ్చు. టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్, ఎండోమెంట్, మనీబ్యాక్, యూలిప్ ప్లాన్స్‌కు ఇది వర్తిస్తుంది. మీరు భారతదేశంలో నివసిస్తున్నవాళ్లై ఉండాలి. వ్యక్తిగతంగా, హిందూ అవిభాజ్య కుటుంబం ఈ మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ 2012 ఏప్రిల్ 1 లోపు ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకొని ఉంటే సమ్ అష్యూర్డ్‌లో 20% లోపే ప్రీమియం ఉండాలి. 2012 ఏప్రిల్ 1 తర్వాత పాలసీ తీసుకుంటే సమ్ అష్యూర్డ్‌లో ప్రీమియం 10% దాటకూడదు. ఒకవేళ పాలసీ హోల్డర్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ను రెండేళ్ల కన్నా ముందు, యూలిప్ ప్లాన్‌ను ఐదేళ్ల కన్నా ముందే సరెండర్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్ రద్దవుతుంది.

Read this: SBI YONO Cash: ఏటీఎం కార్డు లేదా? అయినా డబ్బులు డ్రా చేయొచ్చు ఇలా...

Tax Saving plans, Tax Saving ideas, investment ideas, life insurance, mediclaim, section 80c, section 80d, tax saving tips, how to save tax, tax saving funds, tax saving investment, ట్యాక్స్ సేవింగ్ ప్లాన్స్, ట్యాక్స్ సేవింగ్ ఐడియాస్, ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్, లైఫ్ ఇన్స్యూరెన్స్, మెడిక్లెయిమ్, సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ


సెక్షన్ 80 డీ




హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్, మెడిక్లెయిమ్ ప్లాన్స్, క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్స్, టాప్-అప్ ప్లాన్స్, సూపర్ టాప్-అప్ ప్లాన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌కు అనుబంధంగా ఉండే హెల్త్ రైడర్స్, క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ రైడర్, హాస్పిటల్ క్యాష్ రైడర్, సర్జికల్ కేర్ రైడర్ లాంటివి సెక్షన్ 80 డీ పరిధిలోకి వస్తాయి. మీరు, మీ జీవిత భాగస్వామి, పిల్లల కోసం తీసుకున్న హెల్త్ పాలసీలపై రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. దాంతోపాటు మీ తల్లిదండ్రుల కోసం తీసుకునే పాలసీలపై అదనంగా మరో రూ.25,000 పన్ను మినహాయింపు పొందొచ్చు. అంటే సెక్షన్ 80 డీ కింద మొత్తంగా రూ.50,000 మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ మీ తల్లిదండ్రులు వృద్ధులైతే వారికి రూ.50,000 వరకు హెల్త్ పాలసీలు తీసుకోవచ్చు. అంటే మొత్తంగా రూ.75,000 మినహాయింపు పొందొచ్చు. అదే పన్ను చెల్లించేవారు, వారి తల్లిదండ్రులు కూడా వృద్ధులైతే రూ.1,00,000 పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ చార్ట్ చూడండి.
Loading...
Tax Saving plans, Tax Saving ideas, investment ideas, life insurance, mediclaim, section 80c, section 80d, tax saving tips, how to save tax, tax saving funds, tax saving investment, ట్యాక్స్ సేవింగ్ ప్లాన్స్, ట్యాక్స్ సేవింగ్ ఐడియాస్, ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్, లైఫ్ ఇన్స్యూరెన్స్, మెడిక్లెయిమ్, సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ

వ్యక్తిగతంగా, హిందూ అవిభాజ్య కుటుంబం పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేయొచ్చు. భారతదేశంలో నివసించేవారితో పాటు ఎన్ఆర్‌ఐ, విదేశీయులకు సైతం ఈ మినహాయింపు లభిస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌కు చెల్లించిన ప్రీమియంను ఈ సెక్షన్‌లో క్లెయిమ్ చేసుకోలేరు. నగదు కాకుండా చెక్, నెట్‌బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, ఈసీఎస్, ఆటో డెబిట్ ద్వారా చేసిన చెల్లింపులకే వర్తిస్తుంది.

Budget 2019: మీరు చెల్లించే పన్నులు ఇవే... మీకెన్ని తెలుసు? 129290

ఇవి కూడా చదవండి:

Realme 3 Flash Sale: రియల్‌మీ 3 మరో ఫ్లాష్ సేల్... ఆఫర్లు, ఫీచర్లు ఇవే...

IRCTC Apps: ఈ ఐఆర్‌సీటీసీ యాప్స్ మీ దగ్గరున్నాయా? వాటి ఉపయోగాలు ఇవే...

Paytm App: పేటీఎం నుంచి మరో యాప్... ఫీచర్లు ఇవే
First published: March 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...