TAX RETURNS ALL ABOUT ANNUAL INFORMATION STATEMENT 2 UMG GH
Tax Returns: ట్యాక్స్ కడుతున్నారా..? దీని గురించి తప్పక తెలుసుకోవాలి.. వెరీ యూజ్‌ఫుల్
Income Tax
ఇండియాలో ట్యాక్స్ పేయర్స్ అందరూ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ 2.0 గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS)ను గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టారు. పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరంలో చేసిన అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై ఒకే సమగ్ర ప్రకటనను అందించేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చారు.
ఇండియాలో ట్యాక్స్ పేయర్స్ అందరూ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ 2.0 గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS)ను గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టారు. పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరంలో చేసిన అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై ఒకే సమగ్ర ప్రకటనను అందించేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చారు. పన్ను చెల్లింపుదారులు సులువుగా ఆదాయపన్ను రిటర్న్(ITR) దాఖలు చేయడంతో పాటు వాలంటరీ కాంప్లియన్స్ ప్రమోషన్, నాన్ కాంప్లియన్స్‌ను అరికట్టడం వంటివి దీని ప్రధాన లక్ష్యాలు.
దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ మాజీ ఛైర్మన్ J.B.మహాపాత్ర మాట్లాడారు. పన్ను చెల్లింపుదారులు ఇంతకుముందు ఈ సమాచారాన్ని పొందడానికి చాలా కష్టపడేవారని, కానీ ఇప్పుడు అది వారికి సులభంగా లభిస్తోందని చెప్పారు. ఈ డాక్యుమెంట్ ట్యాక్స్ పేయర్స్‌ను వాలంటరీ కాంప్లియన్స్ వైపు తీసుకెళ్తోందని తెలిపారు.
* యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్(AIS) అంటే ఏంటి?
స్టేట్మెంట్లో ఆదాయపన్ను(I-T) శాఖకు అందజేసే బ్యాంకులు, RTOలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు మొదలైన వాటి ద్వారా చేసిన ట్రాన్సాక్షన్ల వివరాలు ఉంటాయి. AISను రెండు భాగాలుగా విభజించారు. పార్ట్ Aలో పేరు, పాన్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వాటితో సహా పన్ను చెల్లింపుదారుల సాధారణ సమాచారం ఉంటుంది. పార్ట్ Bలో టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(TDS), టాక్స్ కలక్టెడ్ ఎట్ సోర్స్(TCS) సమాచారం ఉంటుంది. 53 నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలు(SFT), పన్నుల చెల్లింపు, ప్లాంట్, యంత్రాలపై అద్దె, లాటరీ, క్రాస్‌వర్డ్ పజిల్ లేదా గుర్రపు పందెం విజయాలు, ప్రావిడెంట్ ఫండ్(PF), బాండ్లపై వడ్డీ, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆఫ్‌షోర్ ఫండ్, భారతీయ కంపెనీల షేర్లు, ఇన్సూరెన్స్ కమీషన్, డిమాండ్, రీఫండ్ మొదలైనవి ఉంటాయి.
IT డిపార్ట్మెంట్ 2022 మార్చిలో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్(AIS)కు అప్డేటెడ్ వెర్షన్ 2.0ని విడుదల చేసింది. ఇది వడ్డీ, డివిడెండ్, సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు మొదలైన అనేక ట్రాన్సాక్షన్లను కవర్ చేస్తుంది. కొత్త వెర్షన్లో, డిపార్ట్మెంట్ నాన్- పాన్ ట్రాన్సాక్షన్లను క్యాప్చర్ చేయడానికి డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించింది. డేటా, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించింది. పన్ను చెల్లింపుదారుల కోసం రిటర్న్‌లను సులభంగా దాఖలు చేయడం కోసం సరళీకృత TISను రూపొందించింది. ఇంకా పన్ను చెల్లింపుదారులు స్టేట్మెంట్ను చూడటానికి, వారి అభిప్రాయాన్ని అప్లోడ్ చేయడానికి AIS మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు.
యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ని యాక్సెస్ చేయడానికి, పన్ను చెల్లింపుదారులు I-T ఇ-ఫైలింగ్ వెబ్సైట్ www.incometax.gov.inలో లాగిన్ అవ్వాలి. సర్వీసెస్ ట్యాబ్ కింద, AISని సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత AIS హోమ్‌పేజీ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ AIS, టాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ(TIS) రెండింటిపై సూచనలను అందిస్తుంది. TIS అనేది AIS సరళమైన సంస్కరణ, ఇది ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కేటగిరీల వారీగా, అసలు, సవరించిన విలువలుగా చూపుతుంది. వీటిని తప్పనిసరిగా పన్ను చెల్లింపుదారుల అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత ప్రాసెస్ చేస్తారు. లాగిన్ అయిన తర్వాత, పన్ను చెల్లింపుదారుడు స్టేట్మెంట్లను PDF, JSON లేదా CSV ఫార్మాట్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
* ఫారమ్ 26AS, AISకి తేడాలు ఏంటి?
ఫారమ్ 26ASతో పోలిస్తే, AIS మరింత సమగ్రమైంది. ఇందులో వర్తించే పన్ను తీసివేశారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా లావాదేవీలు ప్రతిబింబిస్తాయి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయించకపోయినా.. అక్కడ చూపుతుంది. అదేవిధంగా ఇతర లావాదేవీలు, అమ్మకం, ఈక్విటీ కొనుగోలు, మ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్ మొదలైనవి ద్రవ్య పరిమితి లేకుండా ప్రతిబింబిస్తాయి.
ఫారమ్ 26AS విషయంలో.. TDS, TCS, SFTలు మాత్రమే ఉంటాయి. AIS సమగ్రమైనప్పటికీ, పన్ను చెల్లింపుదారులు AIS, TIS, ఫారం 26AS వంటివి వారి వ్యక్తిగత రికార్డులతో సరిదిద్దవలసి ఉంటుంది. I-T డిపార్ట్మెంట్ కొత్త AISను ధ్రువీకరించే వరకు, పూర్తిగా పని చేసే వరకు ఫారమ్ 26AS ఉనికిలో ఉంటుంది.
* పన్ను చెల్లింపుదారు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు?
AISలో ప్రతిబింబించే సమాచారం తమ రికార్డులకు అనుగుణంగా లేదని భావించే పన్ను చెల్లింపుదారులు సరైన సమాచారంతో తమ ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించవచ్చు. వ్యక్తిగత వివరాలు, ఆర్థిక లావాదేవీలతో పాటు స్టేట్మెంట్లోని అన్ని ఎంట్రీలకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.