హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI: సామాన్యులకు శుభవార్త.. ఇంటి అద్దె నుంచి స్కూల్ ఫీజుల వరకు అన్నింటికీ..

RBI: సామాన్యులకు శుభవార్త.. ఇంటి అద్దె నుంచి స్కూల్ ఫీజుల వరకు అన్నింటికీ..

 RBI: సామాన్యులకు శుభవార్త.. ఇంటి అద్దె నుంచి స్కూల్ ఫీజుల వరకు చెల్లింపులన్నీ ఇక మరింత సులభం!

RBI: సామాన్యులకు శుభవార్త.. ఇంటి అద్దె నుంచి స్కూల్ ఫీజుల వరకు చెల్లింపులన్నీ ఇక మరింత సులభం!

Bharat Bill Payment System | ఆర్‌బీఐ తీపికబురు అందించింది. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ పరిధిని మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. త్వరలో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని రకాల చెల్లింపులు నిర్వహించొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Reserve Bank of India | కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా సామాన్యులకు తీపికబురు అందించింది. రానున్న రోజుల్లో ప్రజలు వారి ఇంటి అద్దె (Rent), స్కూల్ ఫీజులు, ట్యాక్స్, ఇతర చార్జీలు వంటి వాటిని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా చెల్లించొచ్చు. ప్రస్తుతం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనేది రికరింగ్ బిల్ పేమెంట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేటి పాలసీ సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ పరిమితిని మరింత విస్తరించేందుకు రెడీ అవుతున్నామని శక్తికాంత్ దాస్ తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని రకాల పేమెంట్లను ఇందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు. రికరింగ్, నాన్ రికరింగ్ పేమెంట్లు నిర్వహించొచ్చని తెలిపారు. దీని వల్ల చాలా ఎక్కువ మంది భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను వినియోగించే అవకాశం ఉందని అంచనా వేశారు. వ్యకులు, వ్యాపారులు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

కస్టమర్లకు కొత్త ఏడాది కానుక.. బ్యాంక్ అదిరిపోయే ప్రకటన!

భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ 2017లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అన్ని రకాల బిల్లులకు సంబంధించి పేమెంట్లు నిర్వహించొచ్చు. ఇది ఇంటర్ ఆపరబుల్. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా పేమెంట్లు చేయొచ్చు. బిల్లు చెల్లించిన తర్వాత వెంటనే కన్ఫర్మేషన్ వస్తుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ప్రిపెయిడ్ కార్డుల ద్వారా పేమెంట్లు చేయొచ్చు. నెఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాలెట్స్, ఆధార్ బేస్డ్ పేమెంట్స్, క్యాష్ రూపంలో చెల్లింపులు చేయొచ్చు. ఎన్‌పీసీఐ ఈ బిల్ పేమెంట్ వ్యవస్థ నిర్వహణ పనులు చూసుకుంటుంది. ఆర్‌బీఐ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఇది పని చేస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు భారీ షాక్.. బ్యాంక్ కీలక నిర్ణయం!

అంతేకాకుండా మరోవైపు ఆర్‌బీఐ యూపీఐ పేమెంట్లను మరింత సులభతరం చేయడానికి రెడీ అవుతుంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. బ్యాంక్ అకౌంట్‌లో కొంత డబ్బులను బ్లాక్ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. ఈ డబ్బులను యూపీఐ ద్వారా ఆటోమేటిక్‌గానే డెబిట్ అయ్యే ప్రాసెస్‌ను అమలు చేయనుంది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగనుంది. కాగా ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్షలో కీలక పాలసీ రేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచిన విషయం తెలిసిందే. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. రెపో రేటుపెరగడం ఈ ఏడాదిలో ఇది ఐదో సారి. దీంతో రుణ గ్రహీతలపై ప్రభావం పడనుంది. డబ్బులు దాచుకునే వారికి ఊరట లభిస్తుంది.

First published:

Tags: Banks, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు