తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్... అత్యవసరంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేవారిని ఆదుకునే బుకింగ్ సర్వీస్. అయితే తత్కాల్లో రైలు టికెట్లు బుక్ చేయడం అంత సులువు కాదు. క్షణాల్లో టికెట్లు బుక్ అయిపోతుంటాయి. అయితే కొన్ని అక్రమ సాఫ్ట్వేర్ల ద్వారా తత్కాల్ టికెట్లను బుక్ చేస్తున్న 60 మంది ఏజెంట్లను రైల్వే అరెస్ట్ చేసింది. పలు సాఫ్ట్వేర్ల ద్వారా ఐఆర్సీటీసీ లాగిన్ క్యాప్చాను బైపాస్ చేసి తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. Jaguar, MAC, ANMS పేర్లతో రూపొందించిన సాఫ్ట్వేర్లతో చాలా వేగంగా తత్కాల్ టికెట్లను బుక్ చేస్తున్నారు ఏజెంట్లు. సాధారణంగా ఓ ప్రయాణికుడు తత్కాల్లో రైలు టికెట్ బుక్ చేయాలంటే 2.55 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ సాఫ్ట్వేర్లు ఉపయోగించడం ద్వారా 1.48 నిమిషాల్లోనే తత్కాల్లో రైలు టికెట్ బుక్ చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో నిజాయితీగా బుక్ చేసేవారికి తత్కాల్ రైలు టికెట్లు అందుబాటులో ఉండట్లేదు.
ఫిబ్రవరి 11, 12 తేదీల్లో నిర్వహించిన డ్రైవ్‌లో 319 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. 317 ఐడీలను గుర్తించి బ్లాక్ చేశారు ఆర్పీఎఫ్ పోలీసులు. రూ.37.86 లక్షల విలువైన టికెట్లను బ్లాక్ చేశారు. తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ కోసం ఏజెంట్లు వాడుతున్న అక్రమ సాఫ్ట్వేర్లను బ్లాక్ చేశారు రైల్వే పోలీసులు. దీంతో తత్కాల్ ట్రైన్ టికెట్లు సాధారణ ప్రయాణికుల కోసం ఎక్కువ సమయం అందుబాటులో ఉంటున్నాయి. దీనివల్ల అత్యవసరంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నవారికి తత్కాల్లో రైలు టికెట్ పొందే అవకాశాలు పెరుగుతున్నాయి. తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్‌లో అక్రమాలను అడ్డుకోవడం కోసం సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్-CRIS, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC సహకారం తీసుకుంటోంది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.
ఇవి కూడా చదవండి:
Pan Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్... తీసుకోండి ఇలా
Reliance Jio: రిలయెన్స్ జియో సరికొత్త ప్లాన్... ఒకసారి రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ
IRCTC: రూ.1,00,000 పెట్టుబడి పెడితే నాలుగు నెలల్లో రూ.5,00,000 లాభం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways, Irctc, Railways