టాటా మోటార్స్ రెండు కొత్త సీఎన్జీ కార్లను ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం సామాన్యులకు భారమే. అందుకే సీఎన్జీ వాహనాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని టాటా మోటార్స్ రెండు సీఎన్జీ కార్లను పరిచయం చేసింది. భారతీయ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని టాటా టిగార్ ఐసీఎన్జీ (Tata Tigor CNG), టాటా టియాగో ఐసీఎన్జీ (Tata Tiago CNG) రిలీజ్ చేసింది. ఐసీఎన్జీ టెక్నాలజీతో ఈ రెండు కార్లను పరిచయం చేసింది టాటా మోటార్స్. దీంతో టాటా మోటార్స్ మూడు సెగ్మెంట్లలో వాహనాలను అందిస్తోంది. పెట్రోల్, డీజిల్ సెగ్మెంట్‌తో పాటు ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలను తయారు చేస్తోంది.
టాటా టియాగో ఐసీఎన్జీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.6.09 లక్షలు. ఇందులోనే హైఎండ్ వేరియంట్ ధర రూ.7.64 లక్షలు. టాటా టియాగో ఐసీఎన్జీ కార్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇక టాటా టిగార్ ఐసీఎన్జీ బేసిక్ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.7.69 లక్షలు కాగా, హైఎండ్ వేరియంట్ ధర రూ.8.41 లక్షలు. టాటా టిగార్ ఐసీఎన్జీ రెండు వేరియంట్లలో కొనొచ్చు. టాటా టిగార్ ఐసీఎన్జీ, టాటా టియాగో ఐసీఎన్జీ కార్ల ప్రీ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కస్టమర్లు రూ.5,000 నుంచి రూ.10,000 టోకెన్ అమౌంట్ ఇచ్చి బుకింగ్ చేసుకోవచ్చు.
Aadhar Card: మీ ఆధార్ కార్డును ఎవరైనా వాడుతున్నారా? ఇలా తెలుసుకోండి
Step inside a new world of revolutionary technology with the Tiago and Tigor - iCNG, the future of CNG Technology is here.#iCNG #TataMotors #TataiCNG #TiagoiCNG #TigoriCNG #impressHoJaaoge pic.twitter.com/3YvYgvXpnK
— Tata Motors Cars (@TataMotors_Cars) January 19, 2022
టాటా టిగార్ 2017లో పెట్రోల్ ఇంజిన్‌తో లాంఛ్ అయింది. 1.2 లీటర్ ఇంజిన్ కెపాసిటీతో లభించేది. ఇప్పుడు సీఎన్జీ మోడల్ వచ్చింది. టాటా టిగార్ సీఎన్జీ, టాటా టియాగో సీఎన్జీ కార్లలో డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ, డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. టాటా టిగార్ ఐసీఎన్జీ, టాటా టియాగో ఐసీఎన్జీ కార్లలో రివొట్రాన్ 1.2లీటర్ల బీఎస్6 ఇంజిన్ ఉంది. 73PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సీఎన్జీ కార్ సెగ్మెంట్లో ఇదే ఎక్కువ కెపాసిటీ.
SBI Loan Offer: ఎస్బీఐ శుభవార్త... రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు
టాటా టిగార్ ఐసీఎన్జీ, టాటా టియాగో ఐసీఎన్జీ కార్లు మారుతీ సుజుకీ సీఎన్జీ కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మారుతీ నుంచి ఎర్టిగా, వేగనార్, సెలెరియో, ఆల్టో 800 లాంటి సీఎన్జీ మోడల్స్ ఉన్నాయి. మరోవైపు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరల్ని కూడా పెంచింది. ఇన్పుట్ కాస్ట్స్ పెరిగిపోతుండటంతో టాటా మోటార్స్ పలు వాహనాల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Automobiles, CNG, Tata Motors