Tata Tigor EV: మార్కెట్​లోకి టాటా టిగోర్ ఈవీ.. లాంచ్ డేట్ ఫిక్స్.. బుకింగ్స్​ ప్రారంభించిన సంస్థ

(Photo: Tata Motors)

దేశీయ ఆటోమొబైల్​ దిగ్గజం టాటా మోటార్స్​ నుంచి రెండో ఎలక్ట్రిక్​ కారు ‘టిగోర్ ఈవీ(Tata Tigor EV)’ లాంచ్​ కానుంది. ఇందుకు ముహుర్తం కూడా ఫిక్స్ అయింది. అదే రోజు దీని ధర, ఇతర వివరాలను కంపెనీ వెల్లడించనుంది.

  • Share this:
దేశీయ ఆటోమొబైల్​ దిగ్గజం టాటా మోటార్స్​ నుంచి రెండో ఎలక్ట్రిక్​ కారు ‘టిగోర్ ఈవీ(Tata Tigor EV)’ లాంచ్​ కానుంది. ఆగస్టు 31న ఇది భారత్ మార్కెట్​లోకి విడుదలవుతుంది. అదే రోజు దీని ధర, ఇతర వివరాలను కంపెనీ వెల్లడించనుంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్​ కారు బుకింగ్స్​ను కంపెనీ ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 21,000 టోకెన్​ అమౌంట్​ చెల్లించి ఈ కారును బుక్​ చేసుకోవచ్చు. గతేడాది టాటా నుంచి విడుదలైన మొట్టమొదటి ఎలక్ట్రిక్​ కారు(Electric Car).. నెక్సాన్ ఈవీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీగా ప్రసిద్ధికెక్కింది. ఇది భారతీయ ఈవీ మార్కెట్‌లో దాదాపు 70% వాటాను దక్కించుకుంది. ఇదే స్పీడ్​లో ఇప్పుడు కొత్త టిగోర్​ ఈవీని లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఈ ఈవీ జిప్ట్రాన్ హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీ(Ziptron technology)తో రూపొందింది. ఆకట్టుకునే డిజైన్​ గల ఈ కొత్త టిగోర్ ఈవీ సిగ్నేచర్​ టీల్ బ్లూ కలర్​లో లభిస్తుంది. ఎలక్ట్రిక్​ కారును గుర్తు చేసేలా దీని ఇంటీరియర్​ డిజైన్​లో కూడా టీల్​ షేడ్​ను అందించింది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. టాటా టిగోర్​లో ఫాస్ట్​ ఛార్జింగ్​ టెక్నాలజీతో వస్తుంది. ఈ కారును 15A హోమ్​ సాకెట్​ ద్వారా ఛార్జ్​ చేయవచ్చు. ఇంజిన్​ విషయానికి వస్తే.. టిగోర్ EV 55 kW గరిష్ట పవర్ అవుట్‌పుట్​ను ఇస్తుంది. ఇది 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5.7 సెకన్లలో 0 నుండి 60 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. టిగోర్ కారులో EV 26 kWh లిథియం- అయాన్ బ్యాటరీని అందించింది.

TCS: దేశంలో రెండవ అత్యంత విలువైన కంపెనీగా TCS.. 13.5 లక్షల కోట్లు దాటేసిన మార్కెట్ కాప్

జిప్ట్రాన్ టెక్నాలజీతో రూపొందిన ఎలక్ట్రిక్​ కారు..
టిగోర్ EVలోని బ్యాటరీ యూనిట్ IP67 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. దీనిలోని 1,60,000 KM బ్యాటరీ, మోటార్ 8 సంవత్సరాల వారంటీతో వస్తుంది. దీని ఇంజిన్​ రియర్ క్రాష్ కంపాటబుల్ స్ట్రక్చర్‌ గల ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది ODB 64 టెస్ట్ స్టాండర్డ్‌కి అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీనిలోని ఇంపాక్ట్ -రెసిస్టెంట్ బ్యాటరీ ప్యాక్​ AIS - 048 ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుంది. కొత్త టిగోర్​ ఈవీ ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన CCS2 ఛార్జింగ్ ప్రోటోకాల్‌కి అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. టిగోర్ EV రిమోట్ కమాండ్లు రిమోట్ డయాగ్నోస్టిక్స్‌తో సహా 30+ కనెక్ట్ ఫీచర్లతో వస్తుంది.
Published by:Sumanth Kanukula
First published: