హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Tiago NRG: టాటా టియాగో NRG కారుకు CNG ఫ్యూయల్ ఆప్షన్.. కొత్త మోడల్ ధర ఎంతంటే?

Tata Tiago NRG: టాటా టియాగో NRG కారుకు CNG ఫ్యూయల్ ఆప్షన్.. కొత్త మోడల్ ధర ఎంతంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టాటా టియాగో NRG కారుకు కంపెనీ తాజాగా CNG ఫ్యూయల్ ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఈ ఐసీఎన్‌జీ ఎడిషన్‌ను భారత మార్కెట్లో రూ.7.39 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో విడుదల చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుంచి రిలీజ్ అయ్యే కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. మార్కెట్‌లో ఎన్ని బ్రాండ్లు ఉన్నా, టాటా కార్లను లోకల్‌గా ట్రీట్ చేస్తుంటారు. కంపెనీ కూడా క్వాలిటీ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. అందుకే సంస్థ నుంచి వచ్చే మోడళ్లు చాలావరకు సక్సెస్ అవుతుంటాయి. ఇలా ఇప్పటికే సూపర్ పాపులర్ అయిన మోడళ్లలో టియాగో NRG ఒకటి. అయితే ఈ కారుకు కంపెనీ తాజాగా CNG ఫ్యూయల్ ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఈ ఐసీఎన్‌జీ ఎడిషన్‌ను భారత మార్కెట్లో రూ.7.39 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో విడుదల చేసింది.

టాటా టియాగో NRG iCNG రెండు ట్రిమ్ ఆప్షన్లలో లభిస్తుంది. దీన్ని అన్ని టాటా మోటార్స్ అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచుతామని కంపెనీ తెలిపింది. 'NRG' నేమ్‌ప్లేట్‌ను బ్రాండ్ గత సంవత్సరం ఇండియాలో ప్రవేశపెట్టింది. తాజాగా దీనికి CNG వెర్షన్‌ను పరిచయం చేసింది.

ఫీచర్లు, ప్రత్యేకతలు

కొత్త కారు బయటి భాగంలో కొత్త 'iCNG' బ్యాడ్జింగ్‌ ఉంది. ఆర్మర్డ్ ఫ్రంట్ క్లాడింగ్, ఇన్ఫినిటీ బ్లాక్ రూఫ్ విత్ రూఫ్ రైల్స్, మస్క్యులర్ టెయిల్‌గేట్, శాటిన్ స్కిడ్ ప్లేట్, స్క్విర్కిల్ వీల్ ఆర్చ్‌లు, 14-అంగుళాల హైపర్‌స్టైల్ వంటి SUV డిజైన్ ఎలిమెంట్స్‌తో లేటెస్ట్ వెహికల్ క్లాసీగా కనిపిస్తోంది. ఇది ఫారెస్టా గ్రీన్, ఫైర్ రెడ్, పోలార్ వైట్, క్లౌడీ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 177 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న లేటెస్ట్ వెహికల్.. భారతదేశపు మొట్టమొదటి ‘టఫ్‌రోడర్ CNG’ అని నివేదికలు చెబుతున్నాయి.

టాటా టియాగో మోడల్‌ను ఆరేళ్ల క్రితం 2016లో దేశంలో లాంచ్ చేశారు. టాటా మోటార్స్ ఇప్పటి వరకు 4.4 లక్షల యూనిట్లకు పైగా ఈ హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయించింది. ఇండియాలో పెట్రోల్-ఓన్లీ, CNG, ఆల్-ఎలక్ట్రిక్ ట్రిమ్‌లలో వచ్చిన ఏకైక హ్యాచ్‌బ్యాక్ ఇదే కావడం విశేషం.

టియాగో NRG iCNG యూనిక్ డిజైన్‌తో, అప్‌గ్రేడెడ్ కెపాసిటీతో వస్తుందన్నారు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబ. దీని SUV లాంటి డిజైన్ లాంగ్వేజ్, మస్క్యులర్ స్టాన్స్, హై గ్రౌండ్ క్లియరెన్స్‌ వంటివి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నట్లు చెప్పారు. టియాగో NRG నేమ్‌ప్లేట్ లాంచ్ అయినప్పటి నుంచి కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. పోర్ట్‌ఫోలియోను నిరంతరం రిఫ్రెష్ చేసే టాటా మోటార్స్ 'న్యూ ఫరెవర్' బ్రాండ్ ఫిలాసఫీకి అనుగుణంగా టియాగో NRG వెహికల్‌కు iCNG ఇంజిన్‌ను యాడ్ చేశామని రాజన్ చెప్పారు. ఇది కూడా పాత మోడళ్ల మాదిరిగానే మంచి ఆదరణ పొందుతుందన్నారు.

First published:

Tags: CAR, Tata cars

ఉత్తమ కథలు