హోమ్ /వార్తలు /బిజినెస్ /

CNG Cars: సీఎన్‌జీ కార్ కొంటారా? రూ.10 లక్షల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

CNG Cars: సీఎన్‌జీ కార్ కొంటారా? రూ.10 లక్షల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

CNG Cars | మీరు సీఎన్‌జీ కార్ కొనాలనుకుంటున్నారా? మార్కెట్లో రూ.6 లక్షల నుంచే సీఎన్‌జీ కార్లు (CNG Cars) లభిస్తున్నాయి. రూ.10 లక్షల లోపు లభిస్తున్న సీఎన్‌జీ కార్ల గురించి తెలుసుకోండి.

  మార్కెట్లో సీఎన్‌జీ కార్లకు (CNG Cars) డిమాండ్ ఉండటానికి కారణం పెట్రోల్, డీజిల్ కార్ల ధర కన్నా తక్కువ ధరకే లభిస్తాయి. మైలేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే సీఎన్‌జీ కార్లు కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సీఎన్‌జీ కార్లపై ఆసక్తి కనిపిస్తోంది. రూ.10 లక్షల లోపు సీఎన్‌జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. టాటా మోటార్స్ (Tata Motors), మారుతీ సుజుకీ, హ్యుందాయ్ లాంటి కంపెనీలు తక్కువ ధరకే సీఎన్‌జీ కార్లను అందిస్తోంది. రూ.6 లక్షల నుంచే సీఎన్‌జీ కార్లు లభిస్తున్నాయి. మరి వీటిలో ఏ మోడల్ బెస్ట్? ఏ సీఎన్‌జీ కారులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? తెలుసుకోండి.

  Tata Tiago CNG: టాటా టియాగో సీఎన్‌జీ కారు రూ.6.09 లక్షల నుంచి రూ.7.64 లక్షల మధ్య అందుబాటులో ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. 1.2 లీటర్ ఇంజిన్‌తో లభిస్తుంది. 72 hp, 95 Nm పవర్ జనరేట్ చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్ ట్రాన్స్‌మిషన్, ఆటోమెటిక్ ఆప్షన్‌లో లభిస్తుంది. కేజీ సీఎన్‌జీకి 26.49 కిలోమీటర్ల మైలేజీ లభిస్తుంది.

  Aadhaar Card: ఆధార్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్... మీ దగ్గరున్న ఇలాంటి కార్డులు చెల్లవు

  Maruti Suzuki Celerio CNG: మారుతీ సుజుకీ సెలెరియో సీఎన్‌జీ కారు ప్రారంభ ధర రూ.6.58 లక్షలు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఇందులో మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. ఇందులో 1లీటర్ ఇంజిన్ ఉంది. 56.7 hp, 82 Nm పవర్ జనరేట్ చేస్తుంది. ఈ కారు పొడవు 3,695 ఎంఎం, వెడల్పు 1,655 ఎంఎం, ఎత్తు 1,555 ఎంఎం. వీల్ బేస్ 2,435 ఎంఎం. బరువు 905 కిలోలు. గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎం.

  Wagon r CNG: మారుతీ వేగనార్ ఆర్ సీఎన్‌జీ ధర రూ.5.83 లక్షల నుంచి రూ.5.89 లక్షలు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఇందులో 1 లీటర్ ఇంజిన్ ఉంది. ఈ కారులో 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీంతో పాటు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ ఉన్నాయి. టెయిల్ లైట్స్ వోల్వో స్టైల్‌లో ఉంటుంది.

  SBI Debit Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు పోయిందా? ఇలా బ్లాక్ చేసి కొత్త కార్డు పొందొచ్చు

  Hyundai Grand i10 Nios: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అప్‌డేటెడ్ వర్షన్ 2020 ఏప్రిల్‌లో రిలీజైంది. 1.2లీటర్ల ఇంజిన్ ఉంది. ధర రూ.7.07 లక్షలు. ఒక కేజీ సీఎన్‌జీకి 20.7కిలోమీటర్ల మైలేజీ లభిస్తుంది.

  Hyundai Aura: హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ కారు ధర రూ.7.74 లక్షలు. బీఎస్6 స్టాండర్డ్‌తో ఈ కారు లభిస్తుంది. ఇంజిన్ కెపాసిటీ 1.2లీటర్లు. 5-స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. 25.4కిలోమీటర్ల మైలేజీ లభిస్తుంది.

  First published:

  Tags: Auto News, Cars, CNG, MARUTI SUZUKI, Tata Motors

  ఉత్తమ కథలు