హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Tiago: టాటా టియాగో అరుదైన ఘనత...అమ్మకాల్లో సరికొత్త రికార్డు...

Tata Tiago: టాటా టియాగో అరుదైన ఘనత...అమ్మకాల్లో సరికొత్త రికార్డు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

టాటా టియాగో మోడల్ అరుదైన ఘనత సాధించింది. గుజరాత్ లోని సనంద్ ప్లాంట్ తయారైన ఆ వాహనం 3 లక్షల యూనిట్లను ప్రొడక్షన్ మార్కును అందుకుంది.

భారత మార్కెట్లో టాటా కార్లకు ఎంతో క్రేజ్. అత్యుత్తమ కార్లను విపణిలో విడుదల చేస్తూ అత్యధిక కార్లను విక్రయిస్తున్న సంస్థల్లో ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఈ సంస్థకు చెందిన టాటా టియాగో మోడల్ అరుదైన ఘనత సాధించింది. గుజరాత్ లోని సనంద్ ప్లాంట్ తయారైన ఆ వాహనం 3 లక్షల యూనిట్లను ప్రొడక్షన్ మార్కును అందుకుంది. అంటే ఈ ఒక్క ప్లాంట్ లో 3 లక్షల వాహనాలను తయారు చేసింది టాటా మోటార్స్ సంస్థ. తొలిసారిగా 2016లో లాంచ్ అయిన ఈ కారు ఇంపాక్ట్(ఐఎపీఏసీటీ) డిజైన్ ప్రకారం రూపొందించిన తొలి కారుగా గుర్తింపు తెచ్చుకుంది. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది.

బీఎస్6లోనూ వచ్చేసింది..

2018 ఆగస్టులో టాటా టియాగో అత్యధిక విక్రయాలు అందుకున్న కారుగా రికార్డు సృష్టించించి. అంతేకాకుండా అత్యధిక అవార్డులు సొంతం చేసుకున్న వాహనంగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది టియాగో మోడల్ ను బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. అంతేకాకుండా భద్రతా పరంగా గ్లోబల్ ఎన్సీఏపీ ఇచ్చే అడల్ట్ సేఫ్టీ రేటింగ్ లో 4 స్టార్ల రేటింగ్ ను అందుకుంది.

tata tiago

సేఫ్టీలో బెస్ట్..

భద్రతా పరంగా ఈ కారులో అత్యుత్తమ ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం(ఏబీఎస్), కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ (సీఎస్ఈ), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రేర్ పార్కింగ్ అసిస్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వేరియంట్ల వారీగా ఈ ప్రత్యేకతకు ఇంకా మెరుగ్గా పొందుపరిచారు. కాబట్టి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎలాంటి సందేహం లేకుండా కొనుగోలు చేసుకునే సౌలభ్యముంది.

క్యాబిన్ కూడా సూపర్..

కారు లోపల భాగానికొస్తే దీని ముందు మోడల్ కంటే మెరుగైన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. క్యాబిన్ ను పరిశీలిస్తే ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, సరికొత్త టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టంతో పాటు యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో లాంటి ప్రత్యేకతలు దీని సొంతం. ఇవి కాకుండా యూఎస్బీ, ఏయూఎక్స్-ఐఎన్ లాంటి ఇతర కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సరికొత్త టాటా టియాగో బీఎస్6 మోడల్లో 1.2 లీటర్ మూడు సిలీండర్ల పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంంది. ఇది 5-స్పీడ్ మ్యానువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థలతో పనిచేస్తుంది.

First published:

Tags: Automobiles, Business, Cars

ఉత్తమ కథలు