హోమ్ /వార్తలు /బిజినెస్ /

Vande Bharat: వందేభారత్ ట్రైన్స్ కోసం టాటా స్టీల్‌కు కాంట్రాక్ట్.. 200 రైళ్ల తయారీకి ఒప్పందం

Vande Bharat: వందేభారత్ ట్రైన్స్ కోసం టాటా స్టీల్‌కు కాంట్రాక్ట్.. 200 రైళ్ల తయారీకి ఒప్పందం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vande Bharat: వచ్చే ఏడాదిలోగా 22 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను తయారుచేసేలా రైల్వే మంత్రిత్వ శాఖ టాటా స్టీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 200 వందేభారత్‌లు తెచ్చేలా అగ్రిమెంట్‌ కుదిరింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) మొదలైన దగ్గర నుంచి తనదైన ప్రత్యేకతలతో వార్తల్లో నిలుస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని రైల్వే మార్గాల్లోనే వీటిని ప్రవేశపెట్టారు. వాటికి డిమాండ్‌ బాగుండటం, ఆదాయం కూడా బాగా వస్తుండటంతో మరిన్ని వందేభారత్‌ ట్రైన్లను తీసుకొచ్చేలా భారత ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. రాబోయే సంవత్సరాలలో 200 వందేభారత్‌ రైళ్లను తయారు చేసేందుకు టాటాస్టీల్‌తో ఒప్పందం చేసుకుంది. దీని విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం.

భారతదేశంలో ఉక్కు తయారీ సంస్థల్లో టాటా స్టీల్ అగ్రస్థానంలో ఉంటుంది. వచ్చే ఏడాదిలోగా 22 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను తయారుచేసేలా రైల్వే మంత్రిత్వ శాఖ టాటా స్టీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 200 వందేభారత్‌లు తెచ్చేలా అగ్రిమెంట్‌ కుదిరింది. 2024 మొదటి త్రైమాసికం నాటికి దేశంలో మొదటి స్లీపర్ వందేభారత్ వెర్షన్‌ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్దేశించుకుంది.

* ప్రత్యేకతలు ఇవే..

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని అన్ని తరగతుల సీట్లను ప్రస్తుతం టాటాస్టీల్ తయారు చేస్తోంది. రైలు లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను తయారు చేసే కాంట్రాక్ట్ కూడా టాటాస్టీల్‌కే ఇచ్చారు. దీని కింద ప్యానెల్స్‌, కిటికీలు తయారు చేస్తారు. అనుకున్న ఉత్పత్తి లక్ష్యాల మేరకు చేరుకునేలా, పనులు వేగవంతం చేసేందుకు ఈ రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కింద రైలు విడిభాగాల తయారీ కోసం భారతీయ రైల్వే సుమారు రూ.145 కోట్ల టెండర్‌ను కంపెనీకి ఇచ్చింది. తయారీ విడిభాగాలు పూర్తి కావడానికి 12 నెలలు పడుతుంది.

ఇది కూడా చదవండి : పెళ్లి సంబంధాలు రావాలంటే నెలకు ఎంత జీతం ఉండాలి..? ఆస్తకికర లెక్కలివే!

టాటాస్టీల్‌ సంస్థలోని కంపోసైట్స్‌ డివిజన్‌ ఈ ఆర్డర్‌పై పనిచేస్తోంది. ఇక్కడ తయారుచేసే ట్రైన్లలో 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో సీట్లు చాలా ప్రత్యేకమని టాటా స్టీల్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ అండ్ న్యూ మెటీరియల్స్ బిజినెస్ విభాగం) దేబాశిష్‌ భట్టాచార్య పేర్కొన్నారు. వీటిని 180 డిగ్రీల వరకు తిప్పే అవకాశం ఉంటుందన్నారు. విమానంలో మాదిరిగా సీట్లు ఉండటంతో పాటు ప్రయాణికులు అదే స్థాయిలో సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. రైల్వేలో ఇటువంటి సౌకర్యాలు తీసుకురావడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు.

* వందేభారత్‌తో మంచి లాభాలు

వందేభారత్‌ ట్రైన్స్‌తో రైల్వే శాఖకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇండియన్‌ రైల్వే చరిత్రలోనే ఇంతటి లాభాలు రావడం ఇదే మొదటిసారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ రైళ్ల సంఖ్యను మరింత పెంచనున్నారు. 2023-24 బడ్జెట్‌లో రూ.2.41 లక్షల కోట్లు రైల్వేకు కేటాయించారు. దేశంలో ప్రతి రాష్టంలో 100 నుంచి 150 వరకు స్టేషన్లను ఎంపిక చేశారు. వాటిని రీమోడలింగ్‌ చేయనున్నారు. అనంతర కాలంలో మరిన్ని వందభారత్‌ రైళ్లు రానున్నాయి. బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య పెంచుతామని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ గతంలో ప్రకటించారు.

First published:

Tags: Auto, Indian Railways, Tata Group, Vande Bharat Train

ఉత్తమ కథలు