హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bonus: ఉద్యోగులకు భారీ బోనస్.. 2 రోజుల్లో అకౌంట్లలోకి రూ.5 లక్షలు! వారికి మాత్రమే..

Bonus: ఉద్యోగులకు భారీ బోనస్.. 2 రోజుల్లో అకౌంట్లలోకి రూ.5 లక్షలు! వారికి మాత్రమే..

 ఉద్యోగులకు భారీ బోనస్.. 2 రోజుల్లో అకౌంట్లలోకి రూ.5 లక్షలు! వారికి మాత్రమే..

ఉద్యోగులకు భారీ బోనస్.. 2 రోజుల్లో అకౌంట్లలోకి రూ.5 లక్షలు! వారికి మాత్రమే..

Money: ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా బోనస్ డబ్బులు అందించనున్నారు. ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.60 వేలు వస్తాయి. గరిష్టం అయితే రూ.5 లక్షల వరకు లభించొచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Employees | ఉద్యోగులకు బోనస్ లభిస్తుంది. ప్రతి ఏటా చాలా వరకు కంపెనీలు వాటి ఉద్యోగులకు బోనస్ (Bonus) ప్రయోజనాన్ని కల్పిస్తూ ఉంటాయి. తాజాగా టాటా స్టీల్ కూడా తన ఉద్యోగులకు బోనస్ ప్రకటన చేసింది. కంపెనీ మేనేజ్‌మెంట్, ఉద్యోగుల యూనియన్ మధ్య కుదిరిన టాటా స్టీల్ బోనస్ అగ్రిమెంట్ ప్రకారం చూస్తే.. ఉద్యోగులకు (Employees) మొత్తంగా రూ. 317 కోట్ల బోనస్ లభించనుంది. దీని వల్ల ఉద్యోగులకు చాలా వరకు ప్రయోజనం కలుగనుంది.

  ఉద్యోగులకు గరిష్టంగా రూ. 4 లక్షల వరకు బోనస్ లభించే అవకాశం ఉంది. అలాగే కనీసం రూ. 41 వేల బోనస్ వస్తుంది. అలాగే మరో రూ. 20 వేలు అదనంగా లభించనుంది. ప్రతి ఉద్యోగికి కంపెనీ గుడ్‌విల్ అమౌంట్ కింద ఈ డబ్బులను అందించనుంది. కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లోనే పని చేసినందుకు ఈ డబ్బలు ఇస్తున్నారు. బోనస్ డబ్బులు సెప్టెంబర్ 15న ఉద్యోగుల బ్యాంక ఖాతాల్లో జమ కానున్నాయి. కంపనీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 20 శాతం వార్షిక బోనస్ ప్రకటించింది. మునపటి ఏడాది ఇది 16 శాతంగా ఉంది.

  సంక్రాంతికి ఊరెళ్లాలనుకుంటున్నారా? ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్!

  కంపెనీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అదిరిపోయే పనితీరు కనబర్చింది. అందుకే బోనస్ కూడా ఈ స్థాయిలో అందిస్తోంది. మునపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బోనస్ డబ్బులు ఈసారి రూ. 47.23 కోట్ల మేర పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బోనస్ రూ. 270 కోట్లుగా ఉంది. బోనస్ డబ్బు రూ. 300 కోట్లు దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

  పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి ప్రతి నెలా డబ్బులు.. ఎప్పటి నుంచి వస్తాయో తెలుసా?

  2024 వరకు ఇదే బోనస్ ఫార్మూలా వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కనీస బోనస్ రూ. 41,448 + రూ. 20 వేలుగా ఉంది. అలాగే గరిష్ట బోనస్ రూ. 4,58,411 + రూ. 20 వేలుగా ఉంది. మొత్తంగా 23,710 మంది ఉద్యోగులకు బోనస్ లభించనుంది. మొత్తం బోనస్‌లో జంషెడ్‌పూర్ అండ్ ట్యూబ్ డివిజన్ ఎంప్లాయీస్ రూ. 188.64 కోట్లు పొందనున్నారు. వీరికి కనీస బోనస్ రూ. 1.54 లక్షలు. దీనికి రూ. 20 వేల అదనం. అంటే రూ. 1.75 లక్షల వరకు వస్తాయి. అంటే ఉద్యోగులకు భారీ బోనస్ వస్తోందని చెప్పుకోవచ్చు. ఇకపోతే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు అసలు బోనస్ ఇవ్వకుండానే ఉండొచ్చు. కంపెనీలు కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ఉంటాయి. వాటి ప్రకారం బోనస్ ఇవ్వాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంటుంది.  చాలా కంపెనీలు దసరాకు బోనస్ డబ్బులు చెల్లిస్తూ ఉంటాయి. శాలరీతో పాటుగా ఈ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Employees, Money, Ratan Tata, Salary Hike, Tata

  ఉత్తమ కథలు