Home /News /business /

Air India-Tata: సొంత గూటికి చేరిన ఎయిర్ ఇండియా... బిడ్ చేజిక్కించుకున్న టాటా సన్స్

Air India-Tata: సొంత గూటికి చేరిన ఎయిర్ ఇండియా... బిడ్ చేజిక్కించుకున్న టాటా సన్స్

Air India-Tata: సొంత గూటికి చేరిన ఎయిర్ ఇండియా... బిడ్ చేజిక్కించుకున్న టాటా సన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Air India-Tata: సొంత గూటికి చేరిన ఎయిర్ ఇండియా... బిడ్ చేజిక్కించుకున్న టాటా సన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Air India-Tata | నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా సన్స్ (Tata Sons) చేజిక్కించుకున్నారు. రూ.18,000 కోట్లతో బిడ్ గెలుచుకుంది టాటా సన్స్.

    ఊహాగానాలే నిజమయ్యాయి. ఎయిర్ ఇండియా (Air India) సొంత గూటికి చేరింది. ఎయిర్ ఇండియాను టాటా సన్స్ (Tata Sons) చేజిక్కించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రూ.18,000 కోట్లకు ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది టాటా సన్స్. ఈ లావాదేవీలో రూ.14,718 కోట్ల విలువైన ఎయిర్ ఇండియా భవనాలు, భూములు ఉండవు. 2021 డిసెంబర్ నాటికి లావాదేవీ పూర్తై అధికారికంగా ఎయిర్ ఇండియా టాటా సన్స్ చేతుల్లోకి వెళ్తుంది. టాటా సన్స్ చేతుల్లోకి ఎయిర్ ఇండియా వెళ్లినట్టు గత వారమే వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి బిడ్ ఇంకా ఫైనలైజ్ కాలేదని స్పష్టం చేసింది. దీంతో ఆ వార్తలో నిజం లేదని తేలిపోయింది. సరిగ్గా వారం తర్వాత టాటా సన్స్ ఎయిర్ ఇండియా బిడ్ గెలిచినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం విశేషం.

    Special Trains: ప్రయాణికులకు అలర్ట్... దసరాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

    నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్ ఇండియాలోని 100 శాతం వాటాలను అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బిడ్స్‌ను ఆహ్వానించింది. టాటా సైన్స్, స్పైస్ జెట్ బిడ్స్ దాఖలు చేశాయి. స్పైస్ జెట్ కన్నా ఎక్కువ మొత్తానికి బిడ్ దాఖలు చేసిన టాటా సన్స్ యిర్ ఇండియాను చేజిక్కించుకోవడం విశేషం. Welcome back, Air India అంటూ టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ట్వీట్ చేశారు.


    ఎయిర్ ఇండియా చరిత్ర చూస్తే స్వాతంత్య్రానికి ముందే 1932లో టాటా ఎయిర్‌ సర్వీస్ పేరుతో విమానయాన సంస్థను నెలకొల్పారు జేఆర్‌డీ టాటా. 1946లో ఆ సంస్థ ఎయిర్ ఇండియాగా మారింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత... 1953 సెప్టెంబరు 13న భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాను జాతీయం చేసింది. అప్పటి దాకా ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌గా ఉన్న ఎయిర్ ఇండియా... ప్రభుత్వ సంస్థగా మారిపోయింది. ఎయిర్ ఇండియాకు 1977 వరకు జేఆర్‌డీ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అంటే మళ్లీ 64 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా టాటాల చేతుల్లోకి వెళ్లడం విశేషం.

    SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... 4 గంటలు బ్యాంకింగ్ సేవలు బంద్

    ఎయిర్ ఇండియా 2007 నుంచి నష్టాల బాటపట్టింది. ప్ర‌తి రోజూ సుమారు 20 కోట్ల నష్టం రావడం ఎయిర్ ఇండియాను భారీగా దెబ్బతీసింది. 70 వేల కోట్ల న‌ష్టంతో ఎయిర్ ఇండియా దివాళా తీసింది. దీంతో ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. విమానయాన రంగంపై ఆసక్తి ఉన్న టాటా గ్రూప్ చివరకు ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం విస్తారా ఏయిర్ లైన్స్, ఎయిర్ ఏసియాలో టాటా గ్రూప్ వాటాలు ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Air India, Ratan Tata, Tata, Tata Group

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు