Air India కొనుగోలు రేసులో ముందున్న ఆ దిగ్గజ సంస్థ?

టాటా గ్రూప్(TATA Group) ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా(Air India)ను కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది.

news18-telugu
Updated: August 15, 2020, 12:43 PM IST
Air India కొనుగోలు రేసులో ముందున్న ఆ దిగ్గజ సంస్థ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టాటా గ్రూప్(TATA Group) ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ఏ సంస్థ ముందుకు రాకపోవడంతో ఈ ప్రక్రియ జాప్యం అవుతోంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు ఎయిరిండియా కొనుగోలుకు తమకు ఆసక్తి లేదంటూ వెనక్కి తగ్గాయి. ఈ నేపథ్యంలో ఎయిరిండియా కొనుగోలుకు టాటా సన్స్ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ సంస్థ విస్తారా విమానయాన సంస్థను నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరుకల్లా బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి విరిన్ని విషయాల్లో టాటా గ్రూప్‌కు ఇంకా క్లారిటీ లేదని మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఆగస్టు 31కల్లా ఎయిరిండియా విక్రయానికి సంబంధించిన డీల్‌ను ముగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ మళ్లీ బిడ్డింగ్‌ను పొడగించకూడదన్నది కేంద్రం యోచనగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తిగా ఉన్న సంస్థలు ఈ నెలాఖరుకల్లా ఎక్స్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ఈఓఐ) సమర్పించాలని కోరుతోంది. ఇదిలా ఉండగా తీవ్ర ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఎయిరిండియా సంస్థ గత రాత్రి 48 మంది పైలట్లపై వేటు వేసింది. అటు ఐపీఎల్ 2020 టోర్నీ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం కూడా టాటా గ్రూప్ పోటీపడుతుండటం తెలిసిందే.
Published by: Janardhan V
First published: August 15, 2020, 12:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading