డీటీహెచ్ ఆపరేటర్ టాటా స్కై ఆరు సరికొత్త ప్యాక్స్ రిలీజ్ చేయనుంది. యూజర్ల సమయం, డబ్బు ఆదా చేసేందుకు వేర్వేరు భాషల్లో హెచ్డీ, ఎస్డీ ఆరు నెలల ప్యాక్స్ రూపొందిస్తోంది. ఈ ప్యాక్ ధర రూ.2,007 దగ్గర ప్రారంభమవుతుంది. ఒకసారి ప్యాక్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఆరు నెలల పాటు ఇక రీఛార్జ్ చేయించాల్సిన అవసరం లేదు. రూ.2,007 ధరకు హిందీ, గుజరాతీ బేసిక్ ప్యాక్స్, రూ.2,029 ధరకు మరాఠీ బేసిక్ ప్యాక్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. హెచ్డీ ప్యాక్ ధర రూ.2,600 నుంచి రూ.2,900 మధ్య ఉంటుంది. హిందీ బేసిక్ హెచ్డీ ప్యాక్ ధర రూ.2,836 కాగా, గుజరాతీ బేసిక్ హెచ్డీ ప్యాక్ ధర రూ.2,698. హిందీ బేసిక్ హెచ్డీ ప్యాక్ ధర రూ.2,836, గుజరాతీ బేసిక్ హెచ్డీ ప్యాక్ రూ.2,698, మరాఠీ హెచ్డీ బేసిక్ హెచ్డీ ప్యాక్ రూ.2,840 ఉంటుందని అంచనా.
ట్రాయ్ కొత్త నిబంధనల తర్వాత డీటీహెచ్ ఆపరేటర్ల మధ్య పోటీ తీవ్రమైంది. దీంతో సబ్స్క్రైబర్లను నిలుపుకోవడానికి, కొత్త సబ్స్క్రైబర్లను ఆకర్షించేందుకు డీటీహెచ్ ఆపరేటర్లు సరికొత్త ప్యాక్స్ ఆఫర్ చేస్తున్నాయి. టాటా స్కై కూడా ఇటీవల అమెజాన్‌తో కలిసి టాటా స్కై బింజ్ సర్వీస్ ప్రారంభించింది. దాంతో పాటు ప్యాక్స్ ధరల్ని తగ్గించింది. ఇక ఇళ్లల్లో రెండో కనెక్షన్ కోసం రూమ్ టీవీ ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆరు నెలల ప్యాక్స్ రూపొందిస్తోంది.
Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
SBI Home Loan: ఎస్బీఐ హోమ్ లోన్ ఆఫర్... అతి తక్కువ వడ్డీ రేట్లు
Smartphone: మీ ఫోన్ పోయిందా? ఒక్క కాల్‌తో బ్లాక్ చేయొచ్చు
Flipkart: 48 గంటల్లో రూ.3 కోట్ల లోన్... సెల్లర్లకు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.