Tata Sky: టాటా స్కై సెట్ టాప్ బాక్స్ ధరలు తగ్గాయి... కొత్త రేట్లు ఇవే

Tata Sky | టాటాస్కై సెట్ టాప్ బాక్సుల ధరలు తగ్గాయి. కొత్తగా కొనేవారికి నాలుగు రకాల సెట్ టాప్ బాక్సుల్ని ఆఫర్ చేస్తోంది టాటా స్కై.

news18-telugu
Updated: May 24, 2019, 3:53 PM IST
Tata Sky: టాటా స్కై సెట్ టాప్ బాక్స్ ధరలు తగ్గాయి... కొత్త రేట్లు ఇవే
Tata Sky: టాటా స్కై సెట్ టాప్ బాక్స్ ధరలు తగ్గాయి... కొత్త రేట్లు ఇవే
news18-telugu
Updated: May 24, 2019, 3:53 PM IST
డైరెక్ట్ టు హోమ్ ఇండస్ట్రీలో కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ట్రాయ్ కొత్త గైడ్‌లైన్స్ తర్వాత ఈ పోటీ మరింత పెరిగింది. దీంతో డీటీహెచ్ కంపెనీలైన టాటాస్కై, డిష్‌టీవీ, డీ2హెచ్, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ లాంటి కంపెనీలన్నీ పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లమీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్ రిలీజైంది. ఇప్పుడు కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు టాటాస్కై సెట్ టాప్ బాక్సుల ధరల్ని తగ్గించేసింది. కొత్తగా కొనేవారికి నాలుగు రకాల సెట్ టాప్ బాక్సుల్ని ఆఫర్ చేస్తోంది టాటా స్కై.

గతంలో టాటా స్కై ఎస్‌డీ సెట్ టాప్ బాక్సు ధర రూ.2,000 దగ్గర ప్రారంభమయ్యేది. ప్రస్తుతం రూ.1,499 ధర నుంచి ప్రారంభమవుతుంది. కొత్త కనెక్షన్‌కు ఎంచుకునే ప్యాకేజీని బట్టి ధర మారుతుంది. ఒకవేళ హెచ్‌డీ టీవీ అయితే Tata Sky HD STB తీసుకోవాలి. గతంలో Tata Sky HD STB ప్రారంభ ధర రూ.2,200 ఉండగా ప్రస్తుతం రూ.1,699 నుంచి ధర ప్రారంభం అవుతుంది. కాస్త ఎక్కువ స్పెసిఫికేషన్స్‌తో Tata Sky+ HD సెట్ టాప్ బాక్సు ఉంది. లైవ్ టీవీని పాజ్ చేయడంతో పాటు ఒకేసారి 3 ఛానెళ్లను రికార్డ్ చేయొచ్చు. దీని ధర రూ.9,300. ఇక Tata Sky 4K STB కూడా ఉంది. దీని ధర రూ.6,400. రెండు సెట్ టాప్ బాక్సుల ధరల్ని తగ్గించిన టాటాస్కై, మరో రెండు బాక్సుల ధరల్ని అలాగే ఉంచింది.

నాలుగు టాటా స్కై సెట్ టాప్ బాక్సులను మీరు ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లల్లో కూడా కొనొచ్చు. మీకు టాటా స్కై కొత్త కనెక్షన్ కావాలంటే ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది.

Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

SBI Jobs: ఎస్‌బీఐలో 579 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Loading...
Lock Aadhaar: ఎస్ఎంఎస్‌తో ఆధార్ లాక్ చేయొచ్చు ఇలా

Budget Smartphones: బడ్జెట్ ఫోన్ కావాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే...
First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...