రీజనల్ ప్యాక్స్ ధరల్ని మార్చింది టాటా స్కై. అందులో టాటా స్కై తెలుగు ప్యాక్ కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న ప్యాక్స్‌లో కొన్ని కొత్త ఛానెల్స్‌ని యాడ్ చేసింది టాటా స్కై. మొత్తం 25 రీజనల్ లాంగ్వేజ్ ఛానెల్ ప్యాక్స్‌లో మార్పులు చేసింది. కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకునేందుకు ఇటీవల ప్రయత్నిస్తోంది టాటా స్కై. కొద్ది రోజుల క్రితం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉచితంగా ఆఫర్ చేస్తూ టాటా బింజ్ సర్వీస్ ప్రారంభించింది. దాంతో పాటు ఇటీవల హెచ్‌డీ, ఎస్‌డీ సెట్-టాప్ బాక్సుల ధరల్ని తగ్గించింది టాటా స్కై. ఇప్పుడు ప్లాన్స్ ధరల్లో మార్పులు చేసింది. మారిన ప్లాన్స్‌లో తెలుగు ఫ్యామిలీ స్పోర్ట్స్, తమిళ్ ఫ్యామిలీ స్పోర్ట్స్, కన్నడ ఫ్యామిలీ స్పోర్ట్స్, గుజరాతీ రీజనల్, హిందీ స్టార్టర్ హెచ్‌డీ లాంటి ప్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్యాక్స్ ధరల్ని మార్చింది. వీటిలో చాలావరకు ప్యాక్స్ ధరలు తగ్గాయి. గతంలో తెలుగు ఫ్యామిలీ స్పోర్ట్స్ ప్యాక్ ధర రూ.285 ఉండేది. ప్రస్తుతం ఈ ప్యాక్ ధర రూ.282.
తెలుగు ఫ్యామిలీ స్పోర్ట్స్ ప్యాక్- రూ.282
తెలుగు ఫ్యామిలీ స్పోర్ట్స్ హెచ్‌డీ ప్యాక్- రూ.434
తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ ప్యాక్- రూ.297.65
తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ హెచ్‌డీ ప్యాక్- రూ.449.87
తెలుగు ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ ప్యాక్- రూ. 443.20
తమిళ్ తెలుగు బేసిక్ ప్యాక్- రూ.237.75
తెలుగు, కన్నడ బేసిక్ ప్యాక్ రూ.235.82
మీరు ఇందులో ఏదైనా ప్యాక్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్టైతే మారిన ధరలకే ప్లాన్ తీసుకోవచ్చు. ఇక బ్రాడ్‌క్యాస్టర్ ప్యాక్స్‌ని రూ.49 నుంచి అందిస్తోంది టాటా స్కై. ఒక్క టాటా స్కై మాత్రమే కాదు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డీ2హెచ్, డిష్ టీవీ లాంటి కంపెనీలు కూడా సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్లతో వస్తున్నాయి.
Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో
ఇవి కూడా చదవండి:
Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే
ఆన్‌లైన్‌లో చెప్పులు కొంటున్నారా? ఈ 11 జాగ్రత్తలు తప్పనిసరి
పాత ఫోన్ అమ్మేస్తున్నారా? తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలివే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.